డైరెక్టర్‌తో ఎఫైర్ పెట్టుకున్న గోదావరి బ్యూటీ!
'గోదావరి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ నీతూ చంద్ర గుర్తుందా? స్కిన్ షోతో, ఎక్స్ ఫోజింగ్‌తో ప్రేక్షకుల చూపులు తనవైపు తిప్పుకునే ఈ భామ ఆ తర్వాత రాజశేఖర్ నటించిన 'సత్యమేవ జయతే' చిత్రంలో, అనంతరం విశాల్ సరసన 'కిలాడీ' డబ్బింగ్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.
తాజాగా ఆమెకు అటు బాలీవుడ్ లోనూ ఆఫర్లు పెద్దగా లేవు. అయితే ఉన్నట్టుండి ఓ హాలీవుడ్ సినిమాకు సైన్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది ఈ హాట్ బ్యూటీ. ఇంగ్లీష్, గ్రీక్ చిత్రంలో రూపొందుతున్న ఆ సినిమా పేరు 'హోం స్వీట్ హోం'. అంతే కాదు ఆమెపై ఓ హాట్ రూమర్ కూడా వినిపిస్తోంది.
ఈ హలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న Kyriacos Tofaridesతో ఈ భామ ఎఫైర్ నడుపుతోందట. ఇద్దరి మధ్య ఎఫైర్ బాగా ముదిరిందని, హద్దులు కూడా దాటారని గుసగుసలాడుకుంటున్నారు. ఆ దర్శకుడు మరో సినిమాలో కూడా తనకు చాన్స్ ఇచ్చేలా అతన్ని తన వశం చేసుకుందట ఈ హాట్ బ్యూటీ. మరి వీరి బంధం ఎక్కడి వరకు వెలుతుందో..?


Click it and Unblock the Notifications












