సమంతపై నెగెటివ్ ప్రచారం?.. వాళ్లకు చుక్కలు చూపిస్తున్న మాట నిజమేనా..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించిన కొన్ని వార్తలు గత కొన్నిరోజులుగా గుప్పుమంటున్నాయి. సమంత తల్లికాబోతోందని, అందుకే కొత్త సినిమాలకు కమిట్ కావడం లేదని కొందరంటుండగా.. తన వద్దకు కథలు వచ్చినప్పటీకీ వాటిలో మార్పు చేర్పులంటూ దర్శకనిర్మాతలకు సమంత చుక్కలు చూపిస్తోందని ఇంకొందరు అంటున్నారు. ఇందులో ఏది నిజం ఏది అబద్దం అనే మాట పక్కన బెడితే సమంత ఇష్యు మాత్రం ఫిలింనగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి పోతే..

పెళ్లి తర్వాత సమంత జోరు
అక్కినేని నాగ చైతన్యను పెళ్లాడాక సమంత తన సినిమాల జోరు మరింత పెంచేసింది. ఈ మేరకు వరుస సినిమాలు చేస్తూ అక్కినేని కోడలిగా వావ్ అనిపించుకుంటోంది. గతేడాది పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈమె ఈ ఏడాది యూ టర్న్, ఓ బేబీ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంది.

‘96' రీమేక్‌లో మాత్రమే.. ఆ తర్వాత
‘ఓ బేబీ' తర్వాత సమంత ‘96' రీమేక్‌లో మాత్రమే నటిస్తోంది సమంత. దీని తర్వాత కొత్తగా ఏ సినిమాకూ సంతకం చేయలేదు. దీంతో ఈమెపై రూమర్స్ పుట్టించడం స్టార్ట్ చేశారు గాసిప్ రాయుళ్లు. సమంత తల్లి కాబోతోందని, అందుకే ఆమె కొత్త సినిమాలకు కమిట్‌మెంట్ ఇవ్వడం లేదనే వార్తలు జోరుగా స్ప్రెడ్ చేసేస్తున్నారు.

ఇంతలో చుక్కలు చూపిస్తోందంటూ మరో న్యూస్
ఈ వార్తలు అలా వస్తుండగానే ఇంతలో సమంత గురించిన మరో వార్త నెట్టింట వైరల్ గా మారింది. సమంతతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని చాలా మంది దర్శకులు మక్కువ చూపుతున్నారని, అయితే ఈ కథలను వెంటనే అంగీకరించకుండా వాటిల్లో మార్పులు, చేర్పులు చేయాలని ఆమె చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇకనైనా ఫుల్‌స్టాప్ పడేనా..?
తనకు ఓ బేబీ, సూపర్ డీలక్స్ లాంటి పవర్ ఫుల్ కథలు వస్తేనే చేస్తానని సమంత అంటోందని, దీంతో కథ చెప్పాలని వచ్చిన కొందరు దర్శకులు ఆ కథను ఆమెకు వినిపించకుండానే వెనుదిరిగి వెళ్తున్నారని అంటున్నారు. ఈ రకంగా పలు కోణాల్లో సమంతపై నెగిటివ్ ప్రచారం మొదలైంది. ఆమె కొత్త సినిమా ఒప్పుకుంటే తప్ప ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపించడం లేదు.

నాగార్జున సహా నాగచైతన్య, సమంత
గత వారం నాగార్జున పుట్టినరోజు వేడుక నిమిత్తం అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి స్పెయిన్‌లోని ఐబిజాకు వెళ్లారు. నాగార్జున సహా నాగచైతన్య, సమంత, అఖిల్, నాగార్జున, అమల తదితరులు ఐబిజా ట్రిప్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా టూర్‌కు సంబంధించిన అప్‌డేట్స్, అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ వస్తోంది సమంత.


Click it and Unblock the Notifications











