twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్ న్యూస్: 'బాహుబలి' పై నెగిటివ్ టాక్??

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తాజా చిత్రం 'బాహుబలి'. ప్రపంచ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించే ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంభందించి ప్రమోషన్స్ పెంచుకుంటూ పోతున్నారు. అయితే సెన్సార్ అయిన తేది నుంచి మరో ప్రక్క నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవటం మొదలైంది.

    దాదాపు నాలుగువేలు కు పైగా థియోటర్లలలో విడుదల అవుతున్న ఈ చిత్రపై ఈ టాక్ ఎంతమేరకు ప్రభావం పడుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రక్క అంతర్జాతీయ మీడియా, నేషనల్ మీడియా సైతం ఈ చిత్రాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్న ఈ సమయంలో ఈ టాక్ రావటం చాలా ఆశ్చర్యకరమైన అంశమే.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Negative Talk for Baahubali

    అంతేకాదు..డైలాగ్ ప్రోమో ట్రైలర్ రిలీజైన నాటి నుంచి మరింతగా ఆ టాక్ పెరిగిపోతూ వస్తోంది. సెన్సార్ టాక్ బాగోలేదని చెప్పుకుంటున్నారు. అయితే అందులో నిజానిజాలు ఏమిటనేది ఎవరూ విచారించటం లేదు. సెన్సార్ మెంబర్స్ చూసింది ఎవరు...ఆ మెంబర్స్ ఎంతమంది ఉంటారు. ఆ చూసిన వారు అసలు ఎవరు బయిటకు టాక్ చెప్తారనేది ఆలోచించకుండా స్ప్రెడ్ చేస్తున్నారు.

    ఓ ప్రక్క ఎంతో అంచనాలు పెరిగిపోయిన ఈ చిత్రానికి ఈ టాక్ ...కొంతవరకూ ఉపయోగపడుతుంది. అంచనాలు తగ్గించి...సినిమాని చూసిన వెంటనే ఆసక్తిని పెంచేలా ఉపయోగపడుుతంది. అయితే అదే సమయంలో బిజినెస్ పై ఈ నెగిటివ్ టాక్ పడే అవకాసం ఉందని అంటున్నారు ట్రేడ్ నిపుణులు.

    ఎవరన్నా కావాలనే ఈ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారా అనే సందేహాలు సైతం చాలా మందికి కలుగుతున్నాయి. ఎందుకంటే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో, సినీ వర్గాల్లో ఈ టాక్ పాకిపోతోంది. ఎన్నో అంచనాలు ఉన్న ఓ భారీ సినిమాపై ఇలాంటి టాక్ స్ప్రెడ్ చేస్తే చాలా ప్రమాదం అంటున్నారు సీనియర్లు.

    Negative Talk for Baahubali

    అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం ‘బాహుబలి' . ఈ చిత్రం సెన్సార్ రీసెంట్ గా పూర్తైన సంగతి తెలిసిందే. 2 గంటలు 39 నిముషాలు ఉన్న ఈ చిత్రానికి U/A రేటింగ్ ఇవ్వటం జరిగింది.

    ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' ట్రైలర్లు, పాటలకు మంచి ప్రజాదరణ దక్కుతోంది. జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వేలకు పైగా ధియేటర్లలో విడుదల అవుతోంది.

    అలాగే ఈ చిత్రం రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ‘యు/ఎ' సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రాన్ని
    , చైనా లాంటి దేశాల్లో సైతం రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

    బాహుబలి ది బిగినింగ్ విడుదలకు దగ్గరవడంతో సినిమా యూనిట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. సాంప్రదాయ ప్రెస్, మీడియా ప్రచారాలతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రచార కార్యక్రమాలతో ‘బాహుబలి' దూసుకుపోతోంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తోన్న బాహుబలి టీమ్ సోషల్ మీడియా ద్వారానే ఈ స్థాయి ప్రచారాన్ని సొంతం చేసుకుంది.

    Negative Talk for Baahubali

    ఇక సోషల్ మీడియా ప్రమోషన్లలో భాగంగా మమతల తల్లి వీడియో సాంగ్‌ను విడుదల చేయగా ఆ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక నేడు బాహుబలిలోని నిప్పులే శ్వాసగా పాటకు సంబంధించిన వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ పాటలో ఇంతకుముందు చూసిన చాలా షాట్లను మళ్ళీ చూపించారు.

    అయితే కొన్ని కొత్త షాట్స్ కూడా జతచేయడంతో సాధారణంగానే ప్రతీ కొత్త షాట్‌కూ అభిమానులు సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రభాస్, రానా, అనుష్క తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో జూలై 10న భారీ ఎత్తున బాహుబలి విడుదల కానున్న విషయం తెలిసిందే!

    ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది.

    English summary
    For Baahubali movie... in a shocking manner negative talk is coming from social media users from last two days. It is going to unveil more than 4000 screens all over the world. Even international media praised the Rajamouli’s project a lot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X