దబంగ్‌లో ఆ మైనస్...గబ్బర్ సింగ్‌కు ప్లస్సవుతుందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏ రేంజిలో అంచనాలు ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. గబ్బర్ సింగ్ ట్రైలర్స్ ఆది నుంచి అదరగొడుతుండటంతో అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో సినిమా ఓపెనింగ్ కలెక్షన్లు రికార్డు సృష్టిచడం ఖాయం అంటున్నారంతా. అంచనాలకు తగిన విధంగానే నిర్మాతలు ఈ చిత్రాన్ని భారీగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
'గబ్బర్ సింగ్'చిత్రం హిందీలో సూపర్ హిట్ అయిన 'దబంగ్' చిత్రానికి రీమేక్. వాస్తవానికి 'దబంగ్' సెకండాఫ్‌పై ఏమంత బాగోలేదనే విమర్శలు వచ్చాయి. అయితే సల్మాన్ ఖాన్ స్టార్ ఇమేజ్‌తో సినిమా సూపర్ హిట్ అయింది. మరి ఒకవేళ గబ్బర్ సింగ్ చిత్రాన్ని దబంగ్‌కు సీన్ టు సీన్ తీసి ఉంటే పరిస్థితి ఏమిటి? సల్మాన్ మాదిరి ఇక్కడ పవర్ స్టార్ పవర్ పని చేస్తుందా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
గతంలో పవర్ స్టార్ హిందీ సినిమా 'లవ్ ఆజ్ కల్' చిత్రానికి రీమేక్‌గా 'తీన్ మార్' చిత్రంలో నటించారు. హిందీ వెర్షన్ సూర్ హిట్టయినా....తెలుగు వెర్షన్ మాత్రం అనుకున్న అంచనాలను రీచ్ కాలేదు. పంజా సినిమా కూడా విడుదలకు ముందు భారీగా అంచనాలు పెంచి ఒక్కసారిగా డీలా పడి పోయింది.
మరో వైపు ఓ నెగెటివ్ రూమర్ పవర్ స్టార్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. నిన్న సెన్సార్ పూర్తి చేసుకున్న ఈచిత్రంపై నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. అంచనాలకు తగిన విధంగా సినిమా లేదని ఒక రూమర్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ రూమర్లలో నిజమెంతో సినిమా విడుదలైతేగానీ చెప్పడం కష్టమే.
ఈ పరిణామాల నేపథ్యంలో 'గబ్బర్ సింగ్' విడుదలపై అభిమానుల్లో టెన్సన్ నెలకొంది. ఈ చిత్రం భారీ విజయం సాధించి పవర్ స్టార్ పరువు నిలబెట్టాలని అభిమానులు తపన పడుతున్నారు. మరి రిజల్ట్ తెలియాలంటే మే 11 వరకు ఆగాల్సిందే.
పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం రాజు, స్ర్కీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ : శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











