హ్యాపీడేస్,కొత్త బంగారులోకం చిత్రాలతో తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న వరుణ్ సందేశ్ కి నేహా శర్మ వార్నింగ్ ఇచ్చిందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. తమిళ హిట్ పొల్లాదవాన్ ఆధారంగా తయారవుతున్న కుర్రాడు చిత్రంలో ఈ కాంబినేషన్ కనిపించబోతోంది. చిరుత చిత్రం తర్వాత నేహా శర్మ చేస్తున్న ఈ చిత్రంలో ఆమె అతనికి లవర్ గా నటిస్తోంది. అయితే నిజజీవితంలోనూ ఆమెను టీజింగ్ చేయబోయి వరుణ్ బోల్తా పడ్డాడని అంటున్నారు. ఆమెతో క్లోజ్ అవ్వాలని రకరకాల ఫీట్స్ వేస్తున్నాడు. ఇది గమనించిన ఆమె ఏదో చెప్పబోతే తను పెరిగింది అమెరికాలో అని అక్కడ డేటింగ్ వంటివి కామన్ అని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేసాడు. అయితే ఆమెకు ఇది విని కాలి సెట్ లో అందరిఎదురుగానే వార్నింగ్ ఇచ్చిందని వినపడుతోంది. నువ్వు ఇండియాలో ఉన్నావన్న స్పృహలో ఉండమని చెప్పింది.ఈ లోగా దర్శకుడు కలగచేసుకుని సర్ధి చెప్పాడని అంటున్నారు.