Chiranjeevi: చిరంజీవి సినిమాకి షాకిచ్చిన టాప్ ఓటీటీ ప్లాట్‌ఫాం!
ఏ సినీ ఇండస్ట్రీలో అయినా కూడా యువ హీరోలు కంటే సీనియర్ హీరోలు సరైన హిట్స్ అందుకుంటే మూవీ లవర్స్ లో వచ్చే ఆ కిక్కే వేరే లెవెల్లో ఉంటుందని చెప్పవచ్చు. ఇలా మారుతున్న ట్రెండ్ లో వస్తున్న మన సీనియర్ హీరోలు పాత పంథాని విడిచి కొత్త కొత్త ప్రయోగాలు మెయిన్ గా యువ దర్శకులతో వర్క్ చేయడం స్టార్ట్ చేసిన సమయం నుంచి కొత్త వెర్షన్ లని మనం చూస్తున్నాం.
కాగా ఇలా తెలుగులో కూడా దాదాపు సీనియర్ హీరోస్ అంతా తమ ఏజ్ కి తగ్గ సాలిడ్ పాత్రలు చేస్తూ అదరగొడుతుండగా ఓ హీరో అభిమానులకి మాత్రం ఇంకా ఆకలి తీరలేదు. మరి ఆ హీరో ఎవరో కూడా కాదు మెగాస్టార్ చిరంజీవే.. కాగా మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి వచ్చాక కూడా పలు కమర్షియల్ సినిమాలు ఇంకా చిన్న ఏజ్ లాంటి సినిమాలే చేస్తున్నారని ఒక టాక్ లేకపోలేదు.

వాల్తేరు వీరయ్య పెద్ద హిట్ అయ్యింది కానీ ఇపుడు జెనరేషన్ ఒక జైలర్, విక్రమ్ లాంటి సెన్సేషనల్ సినిమాల్లో చిరంజీవి పూర్తి పొటెన్షియల్ ని చూడాలని భావిస్తున్నారు. ఇలా ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాలు చేస్తుండగా వాటిలో ఒక సినిమాపై కొంచెం మిక్స్డ్ హైప్ ఉంటే ఒక సినిమాపై మాత్రం భారీ హైప్ నెలకొంది. కాగా ఇపుడు ఈ సినిమాలకి సంబంధించిన ఓటిటి వార్తలు కొన్ని సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
కాగా చిరు నటించిన భారీ సినిమా "విశ్వంభర" తన స్ట్రాంగ్ జోన్ సోషియో ఫాంటసీకి చెందింది. అయితే దీనిపై మొదట్లో భారీ హైప్ ఉంది కానీ తర్వాత మాత్రం తగ్గిపోయింది. అలా మొదట్లో పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధర ఇచ్చేందుకు ముందుకు వచ్చింది కానీ ఇపుడు వెనకడుగు వేస్తుందట.
కాగా ఈ సినిమా కాదు కానీ మరో సినిమా పట్ల నెట్ ఫ్లిక్స్ భారీ ఫిగర్ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నారని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఇపుడు చిరు విశ్వంభర కాకుండా దర్శకుడు అనీల్ రావిపూడి మరో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమాలు చేయనున్నారు. కాగా వీటిలో అనౌన్సమెంట్ తోనే ఊహించని హైప్ ని అందుకున్న సినిమా శ్రీకాంత్ ఓదెలతో ప్రాజెక్ట్.

కాగా ఈ సినిమాకే ఇపుడు నెట్ ఫ్లిక్స్ వారు ఈజీగా 50 కోట్లకి పైగా ఆఫర్ చేస్తున్నట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఆడియెన్స్ లో కూడా విశ్వంభర కంటే దీని మీదే ఎక్కువ ఆసక్తి కనిపించడంతో ఆ సినిమాకి నో చెప్పి ఈ సినిమాకి పెద్ద మొత్తాన్ని ఇస్తామని చెబుతున్నారట.
దీనితో విశ్వంభర పరిస్థితి కొంచెం అయోమయంలో పడ్డట్టు వినికిడి. విశ్వంభర మేకర్స్ కూడా గట్టి హైప్ తెచ్చే పనుల్లోనే ఉన్నారు. మరి చూడాలి దీనికి కూడా అనుకున్న రేంజ్ డీల్స్ వస్తాయో లేదో అనేది. కాగా ఈ సినిమాని బింబిసార దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ ని ఈ సినిమాకి పెట్టారట.


Click it and Unblock the Notifications











