నయనతార, విగ్నేష్ లకి బిగ్ షాక్.. ఆ వివాదం ముగిసింది అనుకునేలోపు మరో వివాదం!
చాలా రోజుల ప్రేమాయణం అలాగే కొన్నేళ్ల సహజీవనం తర్వాత ఎట్టకేలకు నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ను వివాహ బంధంతో ఒక్కటయ్యారన్న సంగతి తెలిసిందే. సుమారు ఏడేళ్ల సహజీవనానికి బ్రేకులు వేస్తూ వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. హిందూ సాంప్రదాయంలో గత నెలలో వీరి వివాహం మహాబలిపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత తిరుమల వెళ్లి ఒక వివాదంలో చిక్కుకున్న ఈ జంట ఇప్పుడు అనూహ్యంగా మరోసారి చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

వీడియోలుగా చిత్రీకరించి
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ఇద్దరితో ప్రేమాయణం నడిపింది. విగ్నేష్ శివన్ తో కూడా ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లదు అనుకుంటున్న సమయంలో ఆమె వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించి ఆసక్తి రేపింది. అయితే వీరి వివాహ వేడుక మొత్తాన్ని వీడియోలుగా చిత్రీకరించి నెట్ఫ్లిక్స్ దాన్ని ప్రసారం చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఏకంగా ఈ ఎపిసోడ్స్ ని గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు అని కూడా ఆ మధ్య ప్రచారం జరిగింది.

బాగానే ఉంది కానీ
అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు మ్యారేజ్ వీడియో టెలికాస్ట్ చేసే విషయంలో నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ దంపతులకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా ముందు చేసుకున్న అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేయడానికి నెట్ఫ్లిక్ సంస్థ సిద్ధమైనట్లు సమాచారం. దానికి ముఖ్య కారణం విగ్నేష్ శివన్ అని అంటున్నారు. ఎందుకంటే నయనతార వివాహానికి రజనీకాంత్, షారుఖ్ ఖాన్, మణి రత్నం, కార్తి వంటి బడా సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఒప్పందం రద్దు
వారి ఫోటోలను ఈ మధ్యనే విగ్నేష్ శివన్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కానీ నెట్ఫ్లిక్స్ మాత్రం ఇది కరెక్ట్ కాదని వివాహ స్ట్రీమింగ్ హక్కులు తమ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎలా ఫోటోలు షేర్ చేస్తారని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరింత ఆలస్యం చేస్తే తమ మీద అభిమానుల్లో ఏర్పడిన ఆసక్తి తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో తాము షేర్ చేశామని దంపతులిద్దరూ బదులిచ్చినట్లు సమాచారం. కానీ ఇది కరెక్ట్ కాదని నెట్లిక్ సంస్థ ఒప్పందం రద్దు చేసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం.

భరించాల్సి వచ్చే అవకాశం
అంతేకాక వీరిద్దరి వివాహ వేడుకకు భారీ మొత్తంలో నెట్ఫ్లిక్స్ ఖర్చుపెట్టిందని అంతేకాక వారి వివాహ హక్కులు స్ట్రీమింగ్ చేయడం కోసం పాతిక కోట్ల రూపాయలు ఆఫర్ కూడా ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుందని అంటున్నారు. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడంతో వివాహ ఖర్చులు కూడా నయనతార, విగ్నేష్ శివన్ భరించాల్సి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎరక్కపోయి ఇరుక్కు పోయి
మరీ ముఖ్యంగా ఈ పెళ్లిలో ఒక్కో ప్లేట్ భోజనానికి 3500 ఖర్చుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వీటికి అదనంగా హోటల్ బుకింగ్స్, అతిధుల రవాణా సౌకర్యాలు, మేకప్ ఆర్టిస్టులు, సెక్యూరిటీ, ఇంటీరియర్- ఎక్స్టీరియర్ డిజైనింగ్ వంటి అనేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడంతో పెళ్లి ఖర్చులు కూడా 10 కోట్ల రూపాయల పైనే అయ్యాయని అంటున్నారు. మరి ఈ క్రమంలో ఇప్పుడు ఒప్పందం రద్దు చేసుకోవడం అంటే ఆ దంపతులు డబ్బులు పెట్టలేరు అని కాదు కానీ ఒక రకంగా ఎరక్కపోయి ఇరుక్కు పోయినట్లే చెప్పాలి.


Click it and Unblock the Notifications











