twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #F3 రేట్ల తగ్గింపు అంతా ఒట్టిదే.. ఆ రేట్లకు ఈ రేట్లకు తేడా ఏంటంటే?

    |

    వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్‌ రాజు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ మల్టీస్టారర్ మూవీ 'ఎఫ్ 3'. గతంలో బ్లాక్‌బస్టర్ గా నిలిచినా 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన 'ఎఫ్3' కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 27న ఎఫ్3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా టికెట్ రేట్ల విషయంలో దిల్ రాజు చేసిన కామెంట్లు కొద్ది రోజుల క్రితం హాట్ టాపిక్ గా మారాయి. మా సినిమా రేట్లు పెంచడం లేదని అంటూ పేర్కొన్నారు. అయితే అదంతా ఒట్టిదే అని తెలుస్తోంది. టికెట్ రేట్లు ఏమాత్రం తగ్గలేదని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    సర్కారు వారి పాట నెమ్మదించడంతో

    సర్కారు వారి పాట నెమ్మదించడంతో

    సరిగ్గా మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న ఎఫ్3 ప్రమోషన్లు యమా స్పీడ్ మీద జరుగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి , హీరోలు వెంకటేష్-వరుణ్ తేజ్ లు ఈ ప్రమోషన్స్ లో గట్టిగా పాల్గొంటున్నారు. మహేష్ బాబు సర్కారు వారి పాట నెమ్మదించడంతో ఆ అడ్వాంటేజ్ ని వాడుకోవడానికి ఎఫ్3 ఎదురు చూస్తోంది.

    టికెట్ రేట్లు పాతవే

    టికెట్ రేట్లు పాతవే


    పైగా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా రంగంలోకి దిగుతున్న ఈ సినిమా ట్రైలర్ అంచనాలకు తగ్గట్టు ఉండడంతో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్యామిలీలను కూడా థియేటర్లకు రప్పించే యోచనలో భాగంగా దిల్ రాజు పదే పదే టికెట్ రేట్లు పాతవే ఉంటాయి అని నొక్కి చెప్పడం హైలైట్ అయింది. గవర్నమెంట్ ఇచ్చిన పాత విధానాన్నే ఫాలో అవుతామని చెప్పారు.

    మాటల వరకే పరిమితం

    మాటల వరకే పరిమితం

    అయితే అది మాటల వరకే పరిమితం అయ్యేలా ఉంది. ఎందుకంటే తెలంగాణ మల్టీ ఫ్లెక్స్ లో గరిష్ట ధర జీఎస్టీ కలిపి 250 రూపాయలుగా ఉంటుంది. ఏఎంబి లాంటి స్పెషల్ థియేటర్లకు ఈ ధర మీద అదనంగా జీఎస్టీ ఉంటుంది. కానీ నిజానికి పాత రేట్ ప్రకారం 200 రూపాయలే. ఇంకా సరిగ్గా చెప్పాలంటే కరోనా కంటే ముందు , ఈ జిఓలు రాకముందు 150 ఉండేది. ఇప్పుడు సింగల్ స్క్రీన్లలో 175 బాల్కనీగా చెబుతున్నారు కానీ ఆ క్లాస్ కూడా గతంలో 125 ఉండాల్సింది.

    కొంత నయం

    కొంత నయం


    కాకపోతే 295 కన్నా కొంత నయం అనే ఊరట తప్ప నిజానికి మరీ విపరీతంగా తగ్గించడం ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే F3 సినిమాకి టిక్కెట్ పెంపుదల లేదు కానీ పెంచుకోకుండా ఉన్న అత్యధిక ధర - మల్టీప్లెక్స్‌లలో రూ. 295 మరియు సింగిల్ స్క్రీన్‌లకు రూ. 175 అమలులో ఉంది. ఫ్లెక్సిబిలిటీ కోసం ప్రభుత్వం ఈ ధరలను అనుమతించింది, అయితే మేకర్స్ ఈ రేట్లనే ప్రామాణిక ధరగా చూస్తున్నారు.

    అందరికీ అందుబాటులో

    అందరికీ అందుబాటులో

    దిల్ రాజు F3 కోసం అందరికీ అందుబాటులో ఉండే ధరలు ఇస్తామని చెప్పి మాగ్జిమం రేట్ స్లాబ్ వంక చూస్తున్నాడు. నిజానికి ఎఫ్‌3 కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, అందుకే ఈ చిత్రానికి ధరలు తక్కువ ఉండేలా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయనే చెప్పారు. ఆయనే ఇప్పుడు మాట తప్పారని ట్రోల్స్ మొదలయ్యాయి.

    English summary
    new confusion was created about f3 ticket rates in a few areas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X