సర్కారు వారి పాట రిలీజ్ విషయంలో మరో టెన్షన్.. తేల్చుకోవాల్సింది మహేష్ ఒక్కడే!

కరోనా లాక్ డౌన్ కారణంగా ఒకవైపు చిత్రపరిశ్రమ అనేక రకాల షూటింగ్ లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పరిస్థితులు కాస్త అనుకూలిస్తుండడంతో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా పనుల్లో వేగం పెంచుతున్నారు. అంతేకాకుండా రిలీజ్ డేట్ విషయంలో కూడా ముందుగానే ఒక నిర్ణయానికి వస్తున్నారు. అయితే విడుదలకు చాలా సినిమాలు సిద్ధంగా ఉండడం వలన రిలీజ్ డేట్స్ దొరకడం చాలా కష్టంగా మారుతుంది. ముఖ్యంగా పండగ సీజన్ లో సినిమాలు రిలీజ్ చేయాలి అంటే రిస్క్ తో కూడుకున్న పని.

ముఖ్యంగా చిన్న సినిమాలు ఫెస్టివల్ కు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే విడుదలకు సిద్ధంగా ఉన్నవాటిలో ఎక్కువగా పెద్ద సినిమాలు బిగ్ బడ్జెట్ సినిమాలున్నాయి. అవన్నీ కూడా పండగ సీజన్స్ లో ఏ మాత్రం వెనక్కి తగ్గేలా లేవని అర్థమవుతోంది. అయితే కొందరు అగ్ర హీరోలు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. 2022 సంక్రాంతికి ఒకేసారి నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటం విశేషం. అయితే ఆ పోటీ నుంచి రెండు సినిమాలు వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

New discussion on sarkaru vaari pata new release date

RRR సంక్రాంతికి వస్తుండడంతో ముద్దుగానే బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమైన కొంతమంది హీరోలు వెనక్కి తగ్గవచ్చు అనే టాక్ కూడా వచ్చింది. అయితే జనవరి 12కు రానున్న భీమ్లా నాయక్ ఈ విషయంలో అయితే ఏమాత్రం తేడా లేదని అదే రోజు సినిమా విడుదల అవుతుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా వివరణ ఇచ్చారు. రాధేశ్యామ్ నిర్మాతలు కూడా అదే తరహాలో క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ జనవరి 16న రాబోతున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇక మరోవైపు మిగిలింది సర్కారు వారి పాట విషయం మాత్రమే. ఇప్పటివరకు మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ విషయంలో అయితే ఎలాంటి అనుమానాలకు తావు ఇవ్వలేదు. షూటింగ్ కంటే ముందుగా సంక్రాంతికి రాబోతున్నట్లు షూటింగ్ మొదలు పెట్టి రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేశారు.

అయితే ఇప్పుడు ఆ తేదీకి మిగతా పెద్ద సినిమాలు కూడా వస్తూ ఉండడం వలన మహేష్ బాబు చర్చలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా రిలీజ్ విషయంపై ఒకసారి ఆలోచిస్తే మంచిది అని నిర్ణయం తీసుకున్నారట. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ పవన్ కళ్యాణ్ సినిమాలు అయితే ఏ మాత్రం వెనక్కితగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే వారితో పోటీపడడానికి మహేష్ బాబు పెద్దగా ఆలోచించలేదు.

New discussion on sarkaru vaari pata new release date

కానీ ఇప్పుడు RRR సినిమా రావడం వలన ఆ ప్రభావం ఎంతో కొంత చూపించే అవకాశం ఉందని సర్కారు వారి పాట విషయంలో కొత్తం నిర్ణయం తీసుకుంటారట. ప్రస్తుతం రిలీజ్ డేట్ మార్చే అవకాశం ఉన్నట్లు అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక కథనాలు ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X