Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇండియన్ 2 క్యాన్సిల్ అయ్యిందని రూమర్స్.. ఆ అప్డేట్స్తో కొత్త అనుమానాలు
సినిమాల ద్వారా మంచి సందేశాన్ని ఎలా ఇవ్వాలో డైరెక్టర్ శంకర్ కు వెన్నతో పెట్టిన విద్య అని తమిళ్ లో చాలా కథనాలు వస్తుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో శంకర్ గతంలో మాదిరిగా క్లిక్లవ్వడం లేదు. రోబో సినిమా వరకు వరుసగా రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుడు శంకర్ సౌత్ మార్కెట్ స్థాయిని కూడా పెంచాడు. అయితే రోబో అనంతరం మళ్ళీ తన స్థాయికి తగ్గట్టుగా విజయాలను అందుకోలేదు. ఐ, 2.ఓ సినిమాలు అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయాయి. ఇక మొదటిసారి శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ప్రొడక్షన్ దశలోనే ఆగిపోయే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి.
దెబ్బ మీద దెబ్బ
2పాయింట్ ఓ అనంతరం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇండియన్ 2 సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని అనుకున్న శంకర్ కు కెరీర్ లో మొదటిసారి భారీ దెబ్బ పడింది. ఆ సినిమాను ఏ సమయాన స్టార్ట్ చేశారో గాని మొదటి నుంచి కూడా అనేక రకాల అడ్డంకులు వస్తున్నాయి. షూటింగ్ లో జరిగిన ప్రమాదమే భారీగా దెబ్బ కొట్టింది. యూనిట్ సభ్యులు కొందరు ప్రాణలు కోల్పోవడమే కోలుకోలేని దెబ్బ.
శంకర్ కు కోపం వచ్చిందా?
ఇక
ఆ
తరువాత
కరోనా
వేటుకు
మరికొన్నాళ్లు
అగాల్సి
వచ్చింది.
అందరూ
షూటింగ్స్
స్టార్ట్
చేస్తున్న
సమయంలో
ఇండియన్
2
షూటింగ్
ను
కూడా
స్టార్ట్
చేయాలని
అనుకున్నాడు
శంకర్.
కానీ
అప్పుడు
నిర్మాణ
సంస్థ
లైకా
ప్రొడక్షన్
బడ్జెట్
విషయంలో
అభ్యంతరం
చెప్పడంతో
శంకర్
కు
కోపం
వచ్చింది.
ఇండియన్ 2 క్యాన్సిల్ అయ్యిందా?
వెయిటింగ్ లిస్ట్ లో పెట్టడంతో మరో సినిమాను స్టార్ట్ చేసుకుంటున్నాను అంటూ శంకర్ తెగేసి చెప్పారని కూడా టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఫైనల్ గా సినిమా మొత్తనికే రద్దయినట్లు రూమర్స్ వసగున్నాయి. ఇటీవల నిర్మాణ సంస్థ లైకాతో శంకర్ చర్చలు జరిపి ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేశారని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అప్పుడేదో చర్చతో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు టాక్ వచ్చింది కానీ అందులో నిజం లేదట.
త్వరలోనే అఫీషియల్ క్లారిటీ..
ఇటీవల వచ్చిన అప్డేట్స్ కారణంగా సినిమా నిజంగానే క్యాన్సిల్ అయినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. శంకర్ వెంటనే రామ్ చరణ్ తో ఒక సినిమాను స్టార్ట్ చేయడానికి కారణం కూడా అదేనట. ఇక ఇండియన్ 2 కెమెరామెన్ రత్నవేలు కూడా సూర్య సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో వాళ్ళు మరో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చారు అంటే ఇప్పట్లో ఇండియన్ 2 స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ గా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.