ఛ..అతనితో ఏం లేదు: త్రిష
త్రిష మరో సారి ప్రేమ పడిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కాస్ట్యూమ్స్ డిజైనర్ సిడ్నీ సెల్డన్ తో ఆమె వ్యవహారం నడుపుతోందంటూ తమిళ టాబ్లాయిడ్స్ రాసాయి. అలాగే ఆమె పర్సనల్ జీవితంలో నిర్ణయాలు సైతం అతన్ని సంప్రదించే తీసుకుంటోందంటూ రాసుకొచ్చాయి. అలాగే ఆమె తల్లి మాట వినక ఇలా ఓ కాస్ట్యూమ్స్ కుర్రాడుతో తిరగటం పద్దతి కాదంటూ రాసుకొచ్చాయి. దీనికి త్రిష తీవ్రంగానే స్పందించింది.
సిడ్నీ కేవలం మంచి స్నేహితుడుని, స్నేహితుడన్నాక రకరకాల విషయాల్లో సంప్రదిస్తామని, తప్పేమీ లేదని చెప్పుకొచ్చింది. అలాగే అతను ప్రబావితం చేస్తే పడిపోయేదాన్ని కాదని తేల్చి చెప్పింది. కాస్ట్యూమ్స్ డిజైనర్ కాబట్టి షాపింగ్ కి వస్తూంటాడని, అయినా తనని తన ఇంట్లో వాళ్ళే అర్ధం చేసుకోలేదని ఎప్పుడూ రూమర్స్ రాసుకునే పత్రికలు వాళ్ళు రాయటంలో పెద్ద ఆశ్చర్యం లేదని ఆమె బాధపడుతూ చెప్పింది. ఇదీ నిజమేనేమో అనిపిస్తోంది కదా..


Click it and Unblock the Notifications











