For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలకృష్ణ కీలక నిర్ణయం: వాళ్లంతా హ్యాండ్ ఇవ్వడంతో రూటు మార్చిన నందమూరి హీరో.!

  By Manoj
  |

  పేరుకు సీనియర్ హీరోనే అయినా కుర్ర హీరోలను మించి యాక్టివ్‌గా ఉంటారు నందమూరి బాలకృష్ణ. సినిమాల విషయంలో ఎంతో డెడికేషన్ చూపించే ఆయన.. క్రమశిక్షణకు మారు పేరుగా ఉంటున్నారు. అదే సమయంలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సరికొత్త ప్రయోగాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన త్వరలోనే ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇంతకీ ఆ సంగతులేంటో చూద్దాం.!

  సక్సెస్‌ మాత్రమే కాదు.. సెన్సేషనల్ కాంబో

  సక్సెస్‌ మాత్రమే కాదు.. సెన్సేషనల్ కాంబో

  టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లు మాత్రమే వంద శాతం సక్సెస్ రేటును సాధించాయి. అంతేకాదు, సెన్సేషన్ కూడా అయ్యాయి. అలాంటి వాటిలో బాలయ్య, బోయపాటి శ్రీను కలయిక ఒకటి. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘సింహా', ‘లెజెండ్' వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ మూవీలు సక్సెస్ అవడమే కాదు.. సంచలనం కూడా అయ్యాయి.

  హ్యాట్రిక్ కోసం కలిశారు.. అన్నీ అవాంతరాలే

  హ్యాట్రిక్ కోసం కలిశారు.. అన్నీ అవాంతరాలే

  బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో సినిమా చేసేందుకు బాలయ్య ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే, అది పట్టాలెక్కడానికి మాత్రం ఆలస్యం అయింది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ముగిశాయి. ఈ లోగా పలు అవాంతరాలు ఏర్పడడం వల్ల రెగ్యూలర్ షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. త్వరలోనే ఇది షూరు కానుంది.

  రిపీట్ చేయడానికి కలిశారు.. ఈ సారి కొత్తగా

  రిపీట్ చేయడానికి కలిశారు.. ఈ సారి కొత్తగా

  గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు పవర్‌ఫుల్ స్టోరీతోనే తెరకెక్కాయి. ఈ రెండింటిలోనూ బాలయ్య నట విశ్వరూపం చూపించారు. ఇప్పుడు కూడా అదే తరహా స్టోరీని రెడీ చేశాడట బోయపాటి. అయితే, ఈ సారి కొంచెం కొత్తగా బాలయ్యను చూపించబోతున్నాడని అంటున్నారు. ఇందులో భాగంగానే నందమూరి హీరో అఘోరాగా కనిపించనున్నారని టాక్.

  ఆ సినిమాల ప్రభావం.. ఇద్దరి ఆశలు దీనిపైనే

  ఆ సినిమాల ప్రభావం.. ఇద్దరి ఆశలు దీనిపైనే

  గత ఏడాది బోయపాటి శ్రీను.. రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ' అనే సినిమా చేశాడు. ఇది బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. అలాగే బాలయ్య ఏకంగా మూడు సినిమాల (యన్.టి.ఆర్ బయోపిక్‌ రెండు భాగాలతో పాటు రూలర్)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూడు చిత్రాలు కూడా పరాజయం పాలయ్యాయి. దీంతో చేయబోయే సినిమాపై ఇద్దరూ ఆశలు పెట్టుకున్నారు.

  ఆ విషయంలో మాత్రం అస్సలు క్లారిటీ లేదు

  ఆ విషయంలో మాత్రం అస్సలు క్లారిటీ లేదు

  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నటించే ఆర్టిస్టుల విషయంలో గానీ, హీరోయిన్ గురించి గానీ క్లారిటీ మాత్రం రాలేదు. ఇందులో పలానా వాళ్లు నటిస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఈ మూవీలో బాలయ్య సరసన నటించే హీరోయిన్లుగా శ్రీయ, నయనతారను ఎంపిక చేశారని జోరుగా ప్రచారం జరిగింది.

  Nandamuri Mokshagna Tollywood Entry Soon | Filmibeat Telugu
  వాళ్లు హ్యాండ్ ఇవ్వడంతో బాలకృష్ణ కీలక నిర్ణయం

  వాళ్లు హ్యాండ్ ఇవ్వడంతో బాలకృష్ణ కీలక నిర్ణయం

  బాలయ్య సినిమాలో నటించేందుకు చాలా మంది హీరోయిన్లు ముందుకు వచ్చి హ్యాండ్ ఇచ్చారట. దీంతో ఈ మూవీకి కొత్త హీరోయిన్లను తీసుకుందామని చిత్ర యూనిట్‌కు ఆయన సూచించారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, వేరే ఇండస్ట్రీలకు చెందిన అమ్మాయిలను కూడా తీసుకోకుండా.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది.

  English summary
  Director Boyapati Srinu will be directing Nandamuri Balakrishna in his next movie. There are more expectations from the fans on the combination of Boyapati Srinu and Balakrishna because of previous hit movies.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X