Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ సినిమా కోసం రిస్క్ చేస్తున్న చైతూ.. మునుపెన్నడూ లేని విధంగా!
యువ హీరో నాగ చైతన్య వరుస సినిమాలు ఒప్పుకొని బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే ఒక సినిమా చేశారు.. సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా, రిలీజ్ కూడా కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.. ఈ సినిమా వాయిదా పడిన తర్వాత ఇటలీ వెళ్ళిన నాగచైతన్య థాంక్యూ అనే సినిమా షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుని వచ్చారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా యొక్క చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముగించడానికి ముందుగా ఆయన మరో సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగ చైతన్య ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి నటించాల్సిన పాత్ర ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో చైతన్యకు దక్కింది.
ఈ సినిమాలో చైతు మునుపెన్నడూ లేని విధంగా ఒక సరికొత్త రూపంలో కనిపించనున్నారు అని అంటున్నారు. అయితే ఆ రూపంలోకి మారాలి అంటే చాలా రోజులు పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే షూటింగ్ నిమిత్తం లాల్ సింగ్ చద్దా సినిమాకి చైతన్య 15 రోజులు కేటాయించాడు. ఈ షూటింగ్ అంతా లడఖ్‌లో జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అమీర్ ఖాన్ ఇటీవలే షూటింగ్ కోసం లొకేషన్ రెక్కీ చేసి లాక్ చేశాడు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టుతో చైతన్య బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే విక్రమ్ కుమార్ అమెజాన్ ప్రైమ్ కోసం దర్శకత్వం వహించబోయే యాక్షన్ థ్రిల్లర్ తో చైతు తన డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నారు.