For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త కుర్రాడుతో సానియా

    By Staff
    |

    Sania Mirza
    టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో సారి బాయ్ ప్రెండ్ ని మార్చిందనే వార్త ఆమె సర్కిల్స్ లో పెద్దగా సంచలనం సృష్టించలేకపోయింది. ఇంతకీ ఈ కుర్రాడుతో ఎంత కాలం ఉంటుందో అనే సందేహమే అందరూ వెళ్ళబుచ్చుతున్నారు. ఆమె ప్రేమ వలలో చిక్కన ఆ కుర్రాడు పేరు షోరబ్ మీర్జా. వీరిద్దరకీ త్వరలో ఎంగేజ్ మెంట్ జరగనుందని సమాచారం. షోరబ్ మీర్జా యూనివర్శల్ బేకరి ఓనర్ కుమారుడు. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ పబ్స్, పార్టీ లంటూ తిరిగుతున్నారు. అయితే ఈ ప్రేమ ఎంతవరకూ వెళ్థుందో తెలియదంటున్నారు.

    గతంలో మోహన్‌ బాబు తనయుడు విష్ణువర్ధన్‌ కు ఆమెకూ మధ్య ఏదో ఉందని పుకార్లు షికార్లు చేశాయి. అలాగ్ విష్ణువర్ధన్ సినిమా ఓపెనింగ్‌కు ప్రత్యేక అతిథిగా సానియా మీర్జా హాజరయ్యేది. వారిద్దరూ క్లాస్‌మేట్స్ అంటూ విష్ణుసన్నిహితులు చెబుతుండేవారు. అయితే విష్ణువర్ధన్‌కు సీఎం బంధువు కుమార్తెతో వివాహం అయ్యాక ఆ బంధం వీగి పోయింది.

    ఆ తర్వాత నవదీప్, సానియా మీర్జాలు సంయుక్తంగా కొన్ని ఫంక్షన్లకు హాజరవుతున్నారంటూ వార్తలు వచ్చాయి.దానికి నవదీప్ ఉషారుగా స్పందిస్తూ...సానియా నేనూ కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకర్నొకరం పరిచయం అయ్యాం. మొల్లిగా ఆ పరిచయం ప్రెండ్ షిప్ కి దారి తీసింది. అలాగే మేమిద్దరం ఒకే జిమ్ లో ఎక్సర్ సైజ్ లు చేస్తాం. అప్పుడప్పుడూ కలుస్తాం. అంతే అంతకు మించి నేనేమి కామెంట్ చేయనన్నాడు. దాంతో విషయం పూర్తిగా చెప్పవచ్చుకదా అని విసుక్కుని ఆమె వెర్షన్ తీసుకుందామని ట్రై చేసారు. అయితే ఆమె నో కామెంట్..నవదీప్ మంచి మిత్రుడు అంది. అయితే ఇదీ ఎంతో కాలం నిలవలేదు.

    ఆ తర్వాత బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తో కలిసి తిరుగుతోందనంటూ ఫొటోలతో సహా వార్తలు వచ్చాయి.కరీనా కపూర్ నుంచి విడిపోయిన షాహిద్ కపూర్ సైతం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని సమర్దించాడు. సానియాతో డేటింగ్ నిజమేనని అతను చెప్పాడు. తాము స్నేహితులమని ఆమె ఆ తర్వాత చెప్పింది. అది ప్రేమగా మారుతుందో లేదో చెప్పలేనని అన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ కథ షోరబ్ మీర్జా వద్దకు వచ్చి ఆగింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X