Don't Miss!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కొత్త కుర్రాడుతో సానియా
గతంలో మోహన్ బాబు తనయుడు విష్ణువర్ధన్ కు ఆమెకూ మధ్య ఏదో ఉందని పుకార్లు షికార్లు చేశాయి. అలాగ్ విష్ణువర్ధన్ సినిమా ఓపెనింగ్‌కు ప్రత్యేక అతిథిగా సానియా మీర్జా హాజరయ్యేది. వారిద్దరూ క్లాస్మేట్స్ అంటూ విష్ణుసన్నిహితులు చెబుతుండేవారు. అయితే విష్ణువర్ధన్‌కు సీఎం బంధువు కుమార్తెతో వివాహం అయ్యాక ఆ బంధం వీగి పోయింది.
ఆ తర్వాత నవదీప్, సానియా మీర్జాలు సంయుక్తంగా కొన్ని ఫంక్షన్లకు హాజరవుతున్నారంటూ వార్తలు వచ్చాయి.దానికి నవదీప్ ఉషారుగా స్పందిస్తూ...సానియా నేనూ కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకర్నొకరం పరిచయం అయ్యాం. మొల్లిగా ఆ పరిచయం ప్రెండ్ షిప్ కి దారి తీసింది. అలాగే మేమిద్దరం ఒకే జిమ్ లో ఎక్సర్ సైజ్ లు చేస్తాం. అప్పుడప్పుడూ కలుస్తాం. అంతే అంతకు మించి నేనేమి కామెంట్ చేయనన్నాడు. దాంతో విషయం పూర్తిగా చెప్పవచ్చుకదా అని విసుక్కుని ఆమె వెర్షన్ తీసుకుందామని ట్రై చేసారు. అయితే ఆమె నో కామెంట్..నవదీప్ మంచి మిత్రుడు అంది. అయితే ఇదీ ఎంతో కాలం నిలవలేదు.
ఆ తర్వాత బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తో కలిసి తిరుగుతోందనంటూ ఫొటోలతో సహా వార్తలు వచ్చాయి.కరీనా కపూర్ నుంచి విడిపోయిన షాహిద్ కపూర్ సైతం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని సమర్దించాడు. సానియాతో డేటింగ్ నిజమేనని అతను చెప్పాడు. తాము స్నేహితులమని ఆమె ఆ తర్వాత చెప్పింది. అది ప్రేమగా మారుతుందో లేదో చెప్పలేనని అన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ కథ షోరబ్ మీర్జా వద్దకు వచ్చి ఆగింది.