Acharya - Akhanda: మెగా నందమూరి అభిమానులను ఊరిస్తున్న కొత్త రిలీజ్ డేట్స్

కరోనా లాక్ డౌన్ వలన గత ఏడాది నుంచి దేశంలో అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. సినిమా షూటింగ్ తో కలకలలాడుతూ కనిపించే ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త సినిమాను స్టార్ట్ చేయాలి అంటే కంగారు పడుతున్నారు. ముఖ్యంగా పెద్ద సినిమాల విడుదల తేదీల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా చర్చలు జరపాల్సి వస్తోంది. అయితే ఎన్ని చర్చలు జరిగినా కూడా కొన్ని సినిమాల విషయంలో ఎవరు వెనక్కి తగ్గడం లేదు.

ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ ఫెస్టివల్స్ పైన పడింది. అసలే జనాలు కరోనా కారణంగా థియేటర్స్ కు పూర్తి స్థాయిలో అయితే ఇంకా అలవాటు పడలేదు. పెద్ద సినిమాలు వస్తే ఆడియెన్స్ నుంచి ఎంతవరకు సపోర్ట్ వస్తుందనేది ఎవరు చెప్పలేని విధంగా ఉంది. పెద్ద సినిమాల్లో అయితే ముందుగా ఆచార్య - అఖండ సినిమాలు విడుదల అవుతాయని తెలుస్తోంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ సినిమా ఈసారి వినాయకచవితి కి కాబోయే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే బాగానే వచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ నటిస్తున్న ఆచార్య సినిమా అక్టోబర్ లో రావచ్చని తెలుస్తోంది. రిలీజ్ డేట్స్ విషయంలో చిత్ర యూనిట్ ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కానీ ముందు జాగ్రత్తగా కొన్ని తేదీలపై స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కేవలం అది ఒక ఆలోచన మాత్రంగానే వస్తోంది. కానీ ఎవరు ఇంకా బలంగా అయితే ఫిక్స్ అవ్వలేదు.

New release dates for akhanda and acharya movies

అనుకున్నట్టుగా వర్కౌట్ అయితే ఆచార్య, అఖండ సినిమాలు రెండూ కూడా నాలుగు రోజులు గ్యాప్ లో విడుదల కావచ్చని టాక్ అయితే వస్తోంది. ముందుగా నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ సినిమా అక్టోబర్ 8న వచ్చే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ మొదటి సారి కలిసి నటిస్తున్న ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక సినిమా అక్టోబర్ 12 లేదా 13వ తేదీలలో రిలీజ్ చేయవచ్చని మరొక టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది.

ఈ విషయంలో చిత్రయూనిట్ కొంత నమ్మకంతో ఉన్నప్పటికీ కరోనా థర్డ్ వేవ్ మళ్ళీ చెలరేగితే మరోసారి వాయిదా వేయక తప్పదు. ఓటీటీలో అయితే ఈ సినిమాలో ఎంత మాత్రం రిలీజ్ కావాలని ఇదివరకే చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ గా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అలాగే మరొక బిగ్ బడ్జెట్ మూవీ RRR అక్టోబర్ 13న రానున్నట్లు మొన్నటి వరకు ప్రమోషన్స్ బాగానే చేశారు. కానీ ఆ తేదీకి సినిమా వచ్చే అవకాశం లేదని పరిస్థితులు చూస్తుంటే ఈజీగా తెలుస్తోంది. పోటీ తీవ్రత ఎక్కువ కావడంతో వచ్చే ఏడాది జనవరి 8న లేదా జనవరి 20న ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X