»   » ప్లాట్స్ అమ్మకానికి పెట్టిన పవన్ కళ్యాణ్ ...?

ప్లాట్స్ అమ్మకానికి పెట్టిన పవన్ కళ్యాణ్ ...?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ గత రెండు రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్ లో పవన్ కళ్యాణ్ తన ప్లాట్స్ ను అమ్మకానికి పెట్టారనే వార్త చక్కర్లు కొడుతోంది. అది రూమరా లేక నిజమా అనే విషయం తెలియలేదు. తనకు దాదాపు 14 కోట్లు అత్యవసరమవటంతో మాదాపూర్ లోని ఇమేజ్ గార్డెన్ లో ఉన్న ఓ ప్లాట్ ని, చిరాక్ స్కూల్ దగ్గరలో ఉన్న మరో ప్లాట్ ని అమ్మకానికి పెట్టాడని చెప్పుకుంటున్నారు.

అయితే సినిమా కు పదికోట్లు పైగానే రెమ్యునేషన్ తీసుకునే పవన్ కళ్యాణ్ ... 14 కోట్లు కు ఇబ్బంది పడి...తన స్దిరాస్దులను అమ్ముతున్నారనేది నమ్మలేకపోతున్నారు. అంతేగాక పవన్ కళ్యాణ్ అడిగితే ఎన్ని కోట్లు అయినా సర్దేవాళ్ళు ఉంటారనేది నిజం..ఈ నేపధ్యంలో ఈ వార్త ఎంతవరకూ నిజమో తేలాల్సి ఉంది.

ఇక పవన్ కల్యాణ్, సమంత జంటగా నటిస్తున్న క్రేజీ చిత్రం 'అత్తారింటికి దారేది' . త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రణీత మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఈ చిత్రం డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.త్వరలో 25 రోజుల షెడ్యూల్ నిమిత్తం యూరప్ వెళ్లేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా స్పెయిన్‌లోనూ చిత్రీకరణ జరపనున్నారు.

'వన్ లైనర్' డైలాగులకూ, కామెడీకీ పెట్టింది పేరైన త్రివిక్రమ్ ఈ సినిమాలోనూ వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ, ఇటీవలే 'మిర్చి'లో ప్రభాస్ తల్లిగా కనిపించిన నదియా కీలక పాత్రలు చేస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. 'జల్సా' వంటి హిట్ సినిమా తర్వాత పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తయారవుతున్న ఈ సినిమాపై అంచనాలు అసాధారణంగా ఉన్నాయి.

English summary

 Pawan Kalyan is riding high after scoring a blockbuster in form of GabbarSingh. There are rumors buzzing in websites that pawan Selling his plats for urgent need of money.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu