ఓజీ కోసం కొత్త టెక్నాలజీ.. 30 ఏళ్ల కుర్రాడిలా పవన్ కళ్యాణ్.. ఏం చేస్తున్నారంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి చాలా కాలమైంది. చివరిగా 2023లో 'బ్రో' చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిల్లో సంచలనం సృష్టించారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా మెజార్టీతో గెలవడమే కాకుండా.. జనసేనా పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిసి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పొలిటికల్ పార్టీగా రికార్డు సెట్ చేశారు. ఇక ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాక మంత్రిగా చురుకుగా పనిచేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ బిగ్ స్క్రీన్ పై ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారా? అని అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ గా ఘన విజయం సాధించిన తమ అభిమాన నటుడిని మళ్లీ వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ లైనప్ లో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలు ఉన్నాయి. అయితే నెక్ట్స్ 'హరిహర వీరమల్లు' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మే 9న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

New Technology for Pawan Kalyan Sujeeth Upcoming film OG

ఇక నెక్ట్స్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'ఓజీ' ఎప్పుడూ వస్తుందా? అని అందరూ కాచుకొని కూర్చున్నారు. సాహో వంటి భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముంబై, హైదరాబాద్ లో జరుగుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ పూర్తి చేశారు. మళ్లీ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే మిగితా పార్ట్ కూడా పూర్తి కానుంది. అయితే ఈలోగా వీఎఫ్ఎక్స్, సీజీకి సంబంధించిన పనులను పూర్తి చేసుకున్నారంట టీమ్. అందుకు కోసం ఓ కొత్త టెక్నాలజీని వినియోగింస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

ఓజీ చిత్రంలో పవన్ కళ్యణ్ కనికరంలేని డాన్ పాత్ర ఓజాస్ గంభీరాలో కనిపించబోతున్నారు. పదేళ్లు అజ్ఘాతంలో ఉండి తిరిగి ముంబైకి వచ్చిన తర్వాత మరో డాన్ ఓమీ బహును చంపేస్తాడు. మిగితా క్రిమినల్స్ ను కూడా క్లియర్ చేస్తాడు. అయితే అసలు ఆ పదేళ్లు ఏం జరిగింది, ఈ డాన్ కథ ఏంటీ? అనే కథతో భారీ యాక్షన్ సన్నివేశాలతో ఓజీ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను మూడు కాలాలలో కనిపిస్తారంట. అందులో 30 ఏళ్ల యువకుడిగా కనిపించబోతున్నారంట పవన్ కళ్యాణ్.

అయితే అప్పటి లుక్ ను తిరిగి తీసుకురావడానికి ఓజీ టీమ్ De - Aging technologyని వినియోగిస్తున్నారని ప్రచారం. ఈ టెక్నాలజీ ద్వారానటీనటులను యంగ్ లుక్ లో చూపించడం సాధ్యమవుతుంది. రీసెంట్ గా తమిళంలో దళపతి విజయ్ నటించిన 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమాలో ఈ టెక్నాలజీని వాడారు. ఇక ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమా కోసం వాడుతున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ ను మళ్లీ యంగ్ లుక్ లో చేసే అదృష్టం కలుగుతుందని అభిమానులు ఖుషి అవుతున్నారు. డీవీవీ దానయ్య రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Read more about: pawan kalyan sujeeth og movie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X