పుష్పకి కొత్త టెన్షన్ తెచ్చిన ఏపీ ప్రభుత్వం.. రేట్లు కాదు.. అలా దొరికినా థియేటర్లు సీజ్?
ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ రేట్ల వ్యవహారం గురించి సినిమా పరిశ్రమ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే సినిమా టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూ హైకోర్టు తీర్పు ఇవ్వగా దాని మీద ప్రభుత్వం అప్పీల్ కు కూడా వెళ్ళింది. అయితే ఇప్పుడు మరో షాకింగ్ నిర్ణయం కూడా తీసుకుందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

హైకోర్టు రద్దు
ఏప్రిల్ నెలలో ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ రిలీజయింది. టికెట్ రేట్లను తగ్గించడంతో ఆ సినిమా కలెక్షన్లపై భారీ ఎఫెక్ట్ పడింది. ఆ తర్వాత పెద్ద సినిమాలేమీ విడుదల కాలేదు. అలా వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలో మొదలైన ఏపీ సినిమా టికెట్ రేట్ల టెన్షన్ ఇప్పటికీ క్లియర్ అవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ను హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త సినిమాలు విడుదలైన సమయంలో పాత విధానంలో టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు థియేటర్ యజమానులకు అవకాశం కలిగినట్లయింది.

ఏపీ ప్రభుత్వం షాక్
ఇక ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో రిలీజ్ అయ్యే పెద్ద చిత్రాలకు ఉపశమనం కలిగిందని ఇండస్ట్రీ వారంతా మంచి మూగ లో ఉండగా ఏపీ ప్రభుత్వం వారికీ షాక్ ఇచ్చింది. వారందరికీ మరోసారి షాక్ ఇస్తూ సినిమా టికెట్ ధరల జీవో నెం.35 రద్దుపై ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచిలో అప్పీల్ చేసింది.

రేపటికి వాయిదా
అప్పీల్ చేయడమే కాక ప్రభుత్వం వాదనలు వినాలని హైకోర్టును అడ్వకేట్ జనరల్ కోరారు. ఈ మేరకు లంచ్ మోషన్ దాఖలు చేసింది. ఈరోజు ఈ పిటిషన్ పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు జరగాల్సి ఉంది. సింగిల్ బెంచ్ తీర్పు కాపీ అందకపోవటంతో హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. అంటే గురువారం సినిమా టికెట్ల రేట్లు అంశజం మీద హైకోర్టులో విచారణ జరగనుంది.

సీరియస్ అయి
అయితే సినిమా టికెట్ల రేట్లు నియంత్రించాలి అనుకుంటే ఇలా కోర్టుకి వెళ్లిన విషయం మీద సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అందుకే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్స్ తనిఖీకి సిద్ధం అయినట్లు సమాచారం. ఈ సాయంత్రానికి అన్ని థియేటర్స్ ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని అందరు రెవెన్యూ అధికారులను ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది.
Recommended Video

రూల్స్ కు విరుద్ధంగా ఉంటే
ఎక్కడికక్కడ ఎమ్మార్వోలు, వీఆర్వోలు థియేటర్స్ పై రైడ్ చేసి, అక్కడ కోవిడ్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రికల్ సేఫ్టీ వగైరా ప్రోటోకాల్స్ ఉన్నాయా లేవా అని పరిశీలించమని గవర్నమెంట్ ఆదేశించినట్లు సమాచారం. థియేటర్ లో రూల్స్ కు విరుద్ధంగా ఉంటే కనుక స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ ఇంపాక్ట్ అంతా ఎల్లుండి రిలీజ్ అవుతున్న అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప సినిమా మీద కచ్చితంగా పడుతుంది అని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











