నానికి కొత్త తలనొప్పి.. అదే జరిగితే చిక్కులు తప్పనట్టే.. డేట్ మళ్లీ మారుతుందా?

నాచురల్ స్టార్ నానికి ఇప్పుడు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి అని అంటున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ అనే సినిమా డిసెంబర్ 24వ తేదీన విడుదల కావడానికి సిద్దమవుతోంది.. అయితే ఈ సినిమా విడుదల అవుతున్న రోజే మరికొన్ని సినిమాలు కూడా విడుదలకు సిద్ధం కావడంతో నాని ఇప్పుడు టెన్షన్లో పడ్డాడని అంటున్నారు. వివరాల్లోకి వెళితే

Recommended Video

Shyam Singha Roy Teaser : Nani పవర్ఫుల్ పాయింట్... కానీ Pushpa? | Sai Pallavi || Filmibeat Telugu
చాలా కాలమే అయింది

చాలా కాలమే అయింది

నిజానికి నాని హిట్ అందుకొని చాలా కాలమే అయింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వి అనే సినిమాతో అమెజాన్ ప్రైమ్ వేదిక గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఆ సినిమాతో డిజాస్టర్ ను అందుకున్నాడు. ఆ తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీష్ సినిమా కూడా అదే అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కాగా ఆ సినిమాకు కూడా ఊహించనంత రెస్పాన్స్ అయితే రాలేదు.. దీంతో ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుని శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు.

దాని మీదే ఆశలు

దాని మీదే ఆశలు

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్ ను టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని అంటున్నారు. ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని చెబుతుండగా మొత్తం మీద శ్యామ్ సింగరాయ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి ఈ సినిమాలో కనిపించనున్నారు. అందుకే రెండు రోల్స్ లో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.

కీలకంగా సాయి పల్లవి రోల్

కీలకంగా సాయి పల్లవి రోల్

కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి రోల్ చాలా కీలకంగా ఉంటుందని, సాయి పల్లవికి అతీత శక్తులు కూడా ఉంటాయని టాక్ వినిపిస్తుంది. ఇక వి, టక్ జగదీష్ సినిమాలు రెండు సినిమాలు ఓటీటీ వేదికగానే విడుదలయ్యాయి. రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమా థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తుండడంతో ఎలా అయినా ఈ సినిమాతో హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. డిసెంబర్ 24న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

 పుష్ప దెబ్బ

పుష్ప దెబ్బ

ఇప్పుడు అదే డేట్ నానికి టెన్షన్ గా మారింది. ఎందుకంటే డిసెంబర్ మొదటి వారంలో విడుదల కావాల్సిన వరుణ్ తేజ్ గని సినిమా డిసెంబర్ 24వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా ఈ మధ్యనే నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటిదాకా పెద్దగా ప్రచారానికి కూడా నోచుకోని కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా కూడా డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటికి మించి ఇప్పుడు పుష్ప సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతుండటంతో ఈ నాని సినిమాకి ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది.

 అదే టెన్షన్

అదే టెన్షన్

ఒకవేళ పుష్ప సినిమా గనుక వాయిదా పడి 24వ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తే ఈ సినిమా జనవరి నెలలో విడుదల చేయడానికి వాయిదా వేసే అవకాశం ఉంది. కానీ నాచురల్ స్టార్ నాని గత అనుభవాల దృష్ట్యా సినిమా వాయిదా వేయకుండానే విడుదల చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X