ప్రభాస్‌ను టెన్షన్ పెడుతున్న కరోనా.. అతడు చేసిన తప్పు అదేనా!
టాలీవుడ్‌కు చెందిన హీరోనే అయినప్పటికీ... దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. 'ఈశ్వర్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఈయన.. కెరీర్ ఆరంభంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక, 'బాహుబలి' సినిమాతో యూనివర్శల్ స్టార్‌గా మారిపోయిన ప్రభాస్.. వరుసగా పాన్ ఇండియా మూవీలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి కరోనా వల్ల కొత్త టెన్షన్ వచ్చిపడిందట. జార్జియా వెళ్లడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందట. వివరాల్లోకి వెళితే...
Recommended Video

ఇక్కడ ప్రతికూలం.. అక్కడ మాత్రం అనుకూలం
‘బాహుబలి' వంటి సూపర్ హిట్ సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో'. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా హిందీలో మినహా అన్ని భాషల్లో ప్రతికూల ఫలితాలను రాబట్టింది. బాలీవుడ్‌లో మాత్రం సూపర్ హిట్ టాక్‌ను సంపాదించడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దీంతో ప్రభాస్ క్రేజ్ అక్కడ రెట్టింపు అయిపోయింది.

మరోసారి అదే బాటలో.. అలా ఎప్పుడూ చూడలేదు
‘సాహో' తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. ‘జిల్' ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియన్ రేంజ్‌లోనే రూపొందుతుందని అంటున్నారు. పిరియాడిక్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ ఎంతో రొమాంటిక్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్.

ముందు అనుకున్నది అలా మారిపోయింది
ఈ సినిమాకు ‘జాన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారని గతంలో ప్రచారం జరిగింది. అయితే, ‘96'కు రీమేక్‌గా వచ్చిన సమంత - శర్వానంద్ సినిమాకు ‘జాను' అనే పేరు పెట్టడంతో, ప్రభాస్ టైటిల్‌ను మార్చుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే యూవీ క్రియేషన్స్ సంస్థ ‘ఓ డియర్', ‘రాధేశ్యామ్' అనే టైటిళ్లు రిజిస్టర్ చేయించడంతో వాటిలో ఒకటి ఫైనల్ అవుతుందని సమాచారం.

అండగా నిలిచిన ప్రభాస్.. ఎవరూ చేయని పని
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది కరోనా వైరస్. దీని ప్రభావం సినిమా రంగంపై కూడా పడింది. ఈ నేపథ్యంలోనే చాలా మంది సినీ ప్రముఖులు విరాళాలు అందించారు. అందరిలో ప్రత్యేకంగా నిలిచాడు ప్రభాస్. అతడు ఏకంగా రూ. 4 కోట్లు డొనేట్ చేసి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. అలాగే సినీ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన సీసీసీకి కూడా రూ. 50 లక్షలు ఇచ్చాడు.

యంగ్ రెబెల్ స్టార్‌ను టెన్షన్ పెడుతున్న కరోనా
కరోనా ప్రభావం అప్పుడప్పుడే బయట పడుతున్న సమయంలోనూ ప్రభాస్ జార్జియాలో తన సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో అక్కడి నుంచి ఇండియా వచ్చాడు. ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ఎలా కొనసాగించాలన్న దానిపై ప్రభాస్ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

జార్జియా వెళ్లడమే ప్రభాస్ చేసిన తప్పా.!
ఈ మూవీ కోసం ఎంత ఖర్చు అయినా ఇక్కడే ఫారెన్ తరహా సెట్ వేద్దామని చిత్ర యూనిట్ భావించిందట. కానీ, ప్రభాస్ మాత్రం దీనికి ఒప్పుకోకుండా జార్జియాలో షూటింగ్ చేశారని సమాచారం. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయడానికి జార్జియా వెళ్లాలి. అయితే, ఇప్పుడు పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. భవిష్యత్‌లోనూ పర్మీషన్ రావాలంటే కష్టమే. ఈ కారణంగానే చిత్ర యూనిట్ టెన్షన్ పడుతుందని సమాచారం.


Click it and Unblock the Notifications











