రవితేజ విషయంలో ఆ వార్తలు అన్నీ ఫేక్.. అసలు విషయం ఏమిటంటే?
రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తీవ్రంగా విఫలమైంది. ఈ నేపద్యంలో సినిమాకు దారుణమైన కలెక్షన్లు వస్తున్నాయి. సినిమా దారుణమైన కలెక్షన్స్ తెచ్చుకుంటున్న నేపద్యంలో రవితేజ తన రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశాడు అంటూ ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

విఫలం
క్రాక్ సినిమాతో హిట్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఖిలాడి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయం మూట కట్టుకున్నాడు. రామారావు ఆన్ డ్యూటీతో మరోసారి మ్యాజిక్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలం అయింది.

రెమ్యూనరేషన్ వెనక్కి
ఈ సినిమాలో రవితేజ సరసం దివ్యాంశా కౌశిక్, అన్వేషి జైన్ హీరోయిన్లుగా నటించారు. రవితేజ ఒక డిప్యూటీ కలెక్టర్ పాత్రలో నటించిన ఈ సినిమా మొత్తం కూడా ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లర్ల మిస్సింగ్ అంశం చుట్టూనే తిరుగుతుంది. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకునే అసలు ఏమాత్రం అంచనాలకు అందకుండా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెమ్యూనరేషన్ రవితేజ వెనక్కి ఇచ్చేశాడంటూ ప్రచారం జరుగుతుంది.

ఆడక పోవడంతో
సినిమా ఆడక పోవడంతో సుమారు 10 కోట్ల వరకు నష్టాలు రావడంతో తన రెమ్యునరేషన్ రవితేజ వెనక్కి ఇచ్చారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అదేమీ నిజం కాదని తెలుస్తోంది. అది కేవలం ప్రచారం అని అంటున్నారు. ఈ సినిమా అనే కాదు ఏ సినిమా డిజాస్టర్ అయినా సరే రవితేజ ఒక్క రూపాయి కూడా వెనక్కి ఇవ్వరని తెలుస్తోంది. రామారావు ఆన్ డ్యూటీ విషయంలో కూడా అదే జరిగిందని అంటున్నారు.

అంచనాలు
సుమారు 10 కోట్ల రూపాయలు ఈ సినిమాకు నష్టం కలిగే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. అయినా సరే రవితేజ రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చే అవకాశం లేదు అనే ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే రవితేజ సినిమా చేయడానికి అంటే ముందే ఈ విషయాలన్నీ అగ్రిమెంట్ చేసుకుంటారట. ఒకవేళ సినిమా ఆడినా, ఆడకపోయినా తన దగ్గర నుంచి మళ్లీ డబ్బులు వెనక్కి తీసుకోకూడదు అని రవితేజ ముందే మాట తీసుకుంటారట.

పట్టించుకోరని
అందుకే మిగతా హీరోలు ఎప్పుడైనా సినిమాలు ఆడకపోయినప్పుడు వాళ్ళు డబ్బులు వెనక్కి ఇచ్చినా రవితేజ మాత్రం వెనక్కి ఇవ్వరని ముందు నుంచే ఆయన దర్శక నిర్మాతలకు క్లారిటీ ఇస్తూ ఉంటారు కాబట్టి ఆయన వెనక్కి ఇవ్వకపోయినా ఎవరు పెద్దగా పట్టించుకోరని అంటున్నారు. ఇక రవితేజ మరిన్ని సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన చేస్తున్న అన్ని సినిమాలలోకి టైగర్ నాగేశ్వరరావు సినిమా మీద భారీగా అంచనాలే ఉన్నాయి.. అలాగే రావణాసుర అనే సినిమా కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.


Click it and Unblock the Notifications











