మహేష్ సినిమా టైటిల్ అదేనా.. వెరీ సింపుల్!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మహేష్ నటిస్తున్న 25వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. డెహ్రాడూన్ లో ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. ఆగష్టు 9 న మహేష్ బాబు జన్మదిన వేడుక సందర్భంగా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బర్త్ డే కౌంట్ డౌన్ లో భాగంగా చిత్ర యూనిట్ కొన్ని రోజులుగా ఒక్కొక అక్షరాన్ని విడుదల చేస్తోంది. ఇప్పటివరకు ఆర్, ఐ, ఎస్ అనే ఆంగ్ల అక్షరాలని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో టైటిల్ గురించి అప్పుడే చర్చ మొదలైపోయింది. ఈ చిత్ర టైటిల్ 'రిషి' అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరి కొందరు మాత్రం మహేష్ పాత్ర పేరు రిషి అని అంటున్నారు. అసలు విషయం తెలియాలంటే ఆగష్టు 9 వరకు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రం రైతు సమస్యల నేపథ్యంలో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. అల్లరి నరేష్ ఈ చిత్రంలో మహేష్ బాబు స్నేహితుడిగా నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. దిల్ రాజు, అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండడం విశేషం.


Click it and Unblock the Notifications











