NBK109: బాలయ్యకు కుర్ర హీరోయిన్ ఫిక్స్.. సగం వయసున్న పిల్లతో రొమాన్సా?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు. అందులో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. 'అఖండ'తో హిట్ ట్రాక్ ఎక్కిన ఆయన.. ఆ వెంటనే 'వీర సింహా రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి సక్సెస్‌లను సొంతం చేసుకున్నారు. ఈ జోష్‌లోనే ఇప్పుడు మరో మూవీ చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమాను బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రం 1980 దశకం నాటి కథతో తెరకెక్కుతోంది. దీన్ని ఈ సినిమా కాన్సెప్టు పోస్టర్‌లో రివీల్ చేశారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

బాబీ - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే ప్రారంభించారు. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లను జరుపుతూ వస్తున్నారు. ఇలా ఇప్పటికే 80 శాతం వరకూ టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను జూలైలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
బాలయ్య కెరీర్‌లోనే హై ఓల్టేజ్ స్టోరీతో రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవరు చేస్తారన్న దానిపై ఎన్నో రకాల ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇందులో త్రిష, మీనాక్షి చౌదరిలను ఫిక్స్ చేశారని ఓ న్యూస్ వైరల్ అయింది. అలాగే, ప్రియమణి, ప్రియాంక జవాల్కర్, శ్రద్దా శ్రీనాథ్ సహా ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, వీళ్లెవరూ ఫైనల్ కాలేదు.

క్రేజీ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతున్న రెండో షెడ్యూల్‌లో ఈమె కూడా భాగం కాబోతుందని తెలిసింది. ఇక, ఇందులో నిధి అగర్వాల్ నటిస్తుందని తెలిసినప్పటి నుంచి చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బాలయ్య మార్క్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఊర్వశీ రౌటేలా, బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, చాందినీ చౌదరి కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి 'వీర మాస్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.


Click it and Unblock the Notifications











