ఎట్టకేలకు మరో ప్రాజెక్ట్ ఓకే.. కొత్త హీరోతో రొమాన్స్ చేయనున్న ఇస్మార్ట్ బ్యూటీ

సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలు బెడిసి కొట్టినా.. నిధి అగర్వాల్‌కు ముచ్చటగా మూడో అవకావం వచ్చింది. పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటించిన నిధికి ఎట్టకేలకు ఓ హిట్ వచ్చి పడింది. అయితే గ్లామర్ పరంగానే మార్కులు కొట్టేసిన ఈ నటి.. స్కిన్ షోనే ప్రధానంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఇస్మార్ట్ విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా మరో ప్రాజెక్ట్ నిధి చెంతకు చేరలేదు. రీసెంట్‌గా నిధి ఓ ప్రాజెక్ట్‌కు సైన్ చేసినట్టు సమాచారం.

తాజాగా నిధి ఓ డెబ్యూ హీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఆ డెబ్యూ హీరో మరెవరో కాదు మహేష్ మేనల్లుడు గల్లా అశోక్. దిల్ రాజు బ్యానర్ లో ఇంతకు ముందే సినిమా ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయింది. అయితే మళ్లీ ప్రాజెక్ట్‌ను సెట్ చేశారు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను గల్లా జయదేవ్ నిర్మిస్తాడని తెలుస్తుంది.

Nidhi Agarwal Romance With Galla Ashok

త్వరలోనే గ్రాండ్‌గా ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించి రెండు మూడు రోజుల్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నెల పదో తేదీన ఈ మూవీ ప్రారంభం కానున్నట్లు టాక్. ఇస్మార్ట్ బ్యూటీ అశోక్ గల్లా తో రొమాన్స్ చేయనుందన్నమాట. మరి ఈసినిమాతో నిధి ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. విజయం వరించినా కెరీర్ ఇంత స్లోగా నడవడం ఏంటో మరి.. ఆ విషయం నిధికే తెలియాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X