Niharika: నిహారిక కొణిదెల విడాకుల కలకలం.. ఊహించని పని చేసిన చైతన్య.. అలా బయటకొచ్చిన సీక్రెట్

మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించి.. ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బ్యూటీ నిహారిక కొణిదెల. సినీ రంగంలో సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతోన్న ఈ బ్యూటీ.. కొన్నేళ్ల క్రితమే చైతన్య జొన్నలగడ్డ అనే కుర్రాడిని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి పర్సనల్ లైఫ్‌ను కూడా బాగానే ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకోబోతున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అసలు దీని వెనుక ఏం జరుగుతోంది? తెలుసుకుందాం పదండి!

చైతన్యతో నిహారిక వివాహం

చైతన్యతో నిహారిక వివాహం

రెండేళ్ల క్రితమే నిహారిక కొణిదెలకు చైతన్య జొన్నలగడ్డతో వివాహం జరిగింది. తన కుమార్తెకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని భావించిన నాగబాబు.. అందుకు అనుగుణంగానే ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్‌లో వీళ్ల పెళ్లి జరిపించారు. దీనికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. అప్పట్లో వీళ్ల పెళ్లి తెగ హైలైట్ అయింది.

భర్త సపోర్టుతో కంటిన్యూగా

భర్త సపోర్టుతో కంటిన్యూగా

వివాహానికి ముందు నిహారిక కొన్ని సినిమాల్లో నటించడంతో పాటు పలు వెబ్ సిరీస్‌లను నిర్మించింది. ఈ క్రమంలోనే వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను ఆపకూడదని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ఇప్పటికే తన సొంత బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లు చేయాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే పలు వెబ్ సిరీస్‌లను కూడా నిర్మించింది. అవి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

భర్తతో కలిసి తెగ ఎంజాయ్

భర్తతో కలిసి తెగ ఎంజాయ్

చైతన్య జొన్నలగడ్డతో వివాహం తర్వాత నిహారిక కొణిదెల కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ.. తన వైవాహిక జీవితాన్ని కూడా ఎంతో సంతోషంగా గడుపుతోంది. తరచూ టూర్లు వెళ్తూ పార్టీలు చేసుకుంటూ యమ ఎంజాయ్ చేస్తోంది. వీటికి సంబంధించిన అప్‌డేట్లను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది. దీంతో వీళ్లను చూసి మెగా అభిమానులు తెగ సంబరపడుతోన్నారు.

విడాకులని.. కొట్టిపారేశారు

విడాకులని.. కొట్టిపారేశారు

నిహారిక కొణిదెల 2020 డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ అన్యోన్యంగానే ఉంటూ వచ్చారు. కానీ, ఒక సందర్భంలో ఈ జంట విడాకులు తీసుకోబోతుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఆ వెంటనే వీళ్లిద్దరూ కలిసి తీసుకున్న కొన్ని ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుని ఆ పుకార్లకు పుల్‌స్టాప్‌ను పెట్టేశారు.

ఇప్పుడు డివోర్స్ కలకలం

ఇప్పుడు డివోర్స్ కలకలం

సాధారణంగా సినీ కపుల్స్ మధ్య డివోర్స్ రూమర్స్ తరచూ వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకోబోతున్నారని మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి. ఆదివారం నుంచి వీళ్లిద్దరి బ్రేకప్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతోన్నారు.

అన్‌ఫాలో చేసుకున్నారుగా

అన్‌ఫాలో చేసుకున్నారుగా

మెగా డాటర్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు వైరల్ అవడానికి కారణం వీళ్లిద్దరూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడమే అని తెలిసింది. ఈ విషయాన్ని కొందరు హైలైట్ చేసి మరీ పోస్టులు చేస్తున్నారు. దీంతో నిజంగానే వీళ్లు విడిపోతున్నారా అన్న అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతోన్నాయి.

ఆ ఫొటోలన్నీ డిలీట్ చేసి

ఆ ఫొటోలన్నీ డిలీట్ చేసి

నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ విడాకుల వార్తలకు బలం చేకూర్చేలా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే వీళ్లిద్దరూ సోషల్ మీడియా ఖాతాల్లో అన్‌ఫాలో చేసుకున్నారని చెప్పుకున్నాం. ఇప్పుడేమో చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నిహారికకు సంబంధించిన పిక్స్‌తో పాటు పెళ్లి ఫొటోలను డిలీట్ చేశాడు. దీంతో ఇది నిజమే అని అంటున్నారు.

కామెంట్లతో కంపు చేస్తూనే

కామెంట్లతో కంపు చేస్తూనే

మెగా ఫ్యామిలీకి చెందిన నిహారికకు చైతన్య విడాకులు ఇచ్చాడని పుకార్లు షికార్లు చేస్తోన్న నేపథ్యంలో.. సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. దీంతో కొందరు మెగా అభిమానులు, సామాన్య నెటిజన్లు చైతన్య పోస్టులకు దీని గురించే కామెంట్లు చేస్తూ దీన్ని కంపు కంపు చేస్తోన్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే ఈ జంట స్పందించక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X