Don't Miss!
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- News ఓటు వెయ్యకపోయినా పర్వాలేదు, నా అంత్యక్రియలకు రండి, ప్రధాని అభ్యర్థి, మోదీని టార్గెట్ చేసి !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిహారిక భర్త కూడా హీరోగా సరికొత్త ఎంట్రీ.. మెగా సపోర్ట్ లేకుండా ఆ రూట్లో వచ్చే ప్రయత్నాలు?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ ఫ్యామిలిలో మెగా కుటుంబం టాప్ లో ఉందనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ అందులో ఏ హీరో కూడా అంత ఈజీగా సక్సెస్ ట్రాక్ లోకి రాలేదు. నిజానికి ఆడియెన్స్ సపోర్ట్ చేస్తేనే ఏ హీరో అయినా ఒక మార్కెట్ సెట్ చేసుకోగలడు. ఇక మెగా హీరోలు కూడా చాలా వరకు విభిన్నమైన పద్దతిలో సక్సెస్ అందుకుంటున్నారు. ఇక త్వరలో మెగా ఫ్యామిలీ నుంచి కొత్త అల్లుడు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్.
ఎవరైనా సరే.. ఆడియెన్స్ సపోర్ట్ ఉంటేనే..
మెగాస్టార్ చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అలాగే సాయి తేజ్, వరుణ్ తేజ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొదట్లో వారికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకోవడానికి కొంత కష్టపడ్డారనే చెప్పాలి. త్వరలో వైష్ణవ్ తేజ్ కూడా రాబోతున్నాడు. అయితే ఫైనల్ గా ఆడియెన్స్ ను మెప్పిస్తేనే ఎంతటివారైనా నిలదొక్కుకుంటారని మెగా హీరోలు నీరూపించారు.
కొత్త అల్లుడు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?
గత కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అతను మెగా సపోర్ట్ లేకుండా ఎదగాలని బాగానే ట్రై చేస్తున్నాడు. ఇక కొత్తల్లుడు చైతన్య జొన్నలగడ్డ కూడా త్వరలోనే టాలీవుడ్ కు సరికొత్తగా ఎంట్రీ ఇవ్వాలని ఆలోచనలు ఉన్నట్లు రూమర్స్ అయితే చాలా కాలంగా వస్తున్నాయి.
మొదటి ఆ రూట్లో వస్తాడట
మంచి హైట్ చూడటానికి హ్యాండ్సమ్ గా ఉన్నాడు. కానీ లుక్స్ ఉన్నంత మాత్రాన క్లిక్కవుతారనే గ్యారెంటీ లేదు. అయితే ఈ చైతన్య ముందు యాక్టింగ్ పై శిక్షణ తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. ఇక ఆ తరువాత మెల్లగా వెబ్ సిరీస్ లతో తన టాలెంట్ ను నిరూపించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. నిహారిక మొదట నాన్నకూచి వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.
సపోర్ట్ లేకుండానే.. ఒంటరి పోరాటం
ఇక వెబ్ సిరీస్ లపై నిహారికకు అనుభవం ఉంది కాబట్టి ఆమె సపోర్ట్ తో చైతన్య మెల్లగా అడుగులు వేయడం కాయమని టాక్ వస్తోంది. ఇక వెండితెరపై ఎంట్రీ ఇచ్చినప్పటికీ మెగా కుటుంబ సభ్యుల ఇన్వాల్మెంట్ లేకుండా కళ్యాణ్ దేవ్ తరహాలోనే వెళ్లాలని చైతన్య ఆలోచిస్తున్నాడట. మరి ఈ ఒంటరి పోరాటం అల్లుళ్లకు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.