తెలుగు హీరోయిన్‌తో నిహారిక మాజీ భర్త .. జోరుగా రెండో పెళ్లి రూమర్లు

మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక విడాకుల వ్యవహారం నేటికీ చిత్ర సీమలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా నిలిచింది. చైతన్య జొన్నలగడ్డ - నిహారిక విడిపోవడానికి ప్రధాన కారణం ఏంటన్నది ఇంత వరకు తెలియరాలేదు. విడాకుల తర్వాత దారులు వేరు కావడంతో ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు. కానీ ఇద్దరూ ఒంటరిగానే ఉంటున్నారు. విడాకులు తీసుకున్న చాలా మంది స్టార్స్ కొత్త తోడు వెతుక్కోవడంతో చైతన్య, నిహారికలు కూడా కొత్త జీవితం ప్రారంభిస్తారా అన్న గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ దశలో చైతన్య జొన్నలగడ్డ పర్సనల్ లైఫ్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సీనియర్ ఐపీఎస్ అధికారి జొన్నలడ్డ ప్రభాకర్ రావు కుమారుడే చైతన్య జొన్నలగడ్డ. 2020 డిసెంబర్‌లో నిహారిక - చైతన్యల వివాహం గ్రాండ్‌గా జరిగింది. కానీ పెళ్లయిన రెండేళ్లకే ఈ జంట విడాకులకు అప్లయ్ చేయడం సినీ పరిశ్రమను, మెగా అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చైతన్య , నేను విడిపోవాలని నిర్ణయించుకున్నామని.. అందరూ సంయమనంతో ఉండాలని, ఈ విషయంలో నాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు అంటూ నిహారిక పెద్ద పోస్ట్ పెట్టారు.

Niharika konidela ex husband chaitanya jonnalagadda Ready to marry young heroine

ఆ వెంటనే చైతన్య కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించాడు. నిహారిక నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని.. వేరు వేరుగా కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పాడు. మా ఇద్దరికి ప్రైవసీ కావాలని.. తమకు మద్ధతు ఇచ్చిన కుటుంబం , స్నేహితులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం చైతన్య తన బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉండగా.. నిహారిక ప్రొడ్యూసర్‌గా నిలదొక్కుకుంటున్నారు. ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

విడాకులు తీసుకున్న పలువురు కొత్త తోడు వెతుక్కుని మరో జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లుగానే నిహారిక , చైతన్యలు కూడా మరో పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చైతన్య గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. నిహారిక నుంచి విడిపోయిన తర్వాత చైతన్య మానసికంగా కృంగిపోయారని, ఈ బాధ నుంచి తట్టుకోవడానికి కొన్నాళ్లు ఆశ్రమంలో ఉన్నట్లుగా సన్నిహితులు చెబుతుంటారు. వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ఇబ్బందులను ఇప్పుడిప్పుడే అధిగమిస్తోన్న చైతన్య తిరిగి వ్యాపార వ్యవహారాల్లో బిజీ అవుతున్నారట.

Niharika konidela ex husband chaitanya jonnalagadda Ready to marry young heroine

ఈ క్రమంలోనే ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని త్వరలోనే వివాహం జరగబోతోందన్నది ఈ వార్త సారాంశం. ఆ పెళ్లి కూతురు కూడా నిహారిక క్లోజ్ ఫ్రెండ్స్‌లో ఒకరని , ఆమె ఓ యంగ్ హీరోయిన్ అని టాక్. కానీ ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం అది హాట్ టాపిక్కే. ఆ వెంటనే అందరి కళ్లూ నిహారికపైనే ఉంటాయన్నది వాస్తవం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X