Niharika Ex Husband: రెండో పెళ్లికి రెడీ అవుతున్న నీహారిక మాజీ భర్త... అమ్మాయి కూడా సెలబ్రెటీనే!
సెలబ్రెటీ జీవితాల్లో పెళ్లి, విడాకులు కామన్ అయిపోయాయి. అయితే ఇటీవల నిహారిక, జోన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక నిహారిక సినిమాలు చేస్తూ.. తన పనిలో తాను బిజీగా ఉంది. అయితే జోన్నల గడ్డ చైతన్య మాత్రం రెండో పెళ్లికి రెడి అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ అమ్మాయి కూడా సెలబ్రిటీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అంటూ వార్తలు అయితే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...
ఇటీవల కాలంలో సెలబ్రెటీల మధ్య మనస్పర్థలు రావడం.. వారు విడిపోవడం సర్వ సాధారణం అయిపోయిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ లో నాగచైతన్, సమంత విడాకుల తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేసింది నిహారిక కొణిదెల విడాకులు. మెగా డాటర్ నిహారిక కొణిదెలకు 2020 డిసెంబర్ లో అంగరంగ వైభవంగ జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు జోన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి జరగ్గా... ఇక మెగా కుటుంబం అంతా కలిసి ఓ పండగలా పెళ్లి వేడుకను జరుపుకున్నారు.

పెళ్లి తర్వాత ఈ జంట కొన్నాళ్లు బానే ఉన్నా.. ఆ తర్వాత వీళ్లద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వీరి మధ్య గొడవలు తలెత్తినట్లు వార్తలు సైతం బయటకు వచ్చాయి. ఇక చైతన్య సాఫ్ట్ వేర్ కావడంత.. నిహారిక సినిమా ఇండస్ట్రీ కావడంతో వీరి మధ్య విభేదాలు ఎక్కువ అయ్యాయని తెలుస్తోంది. ఇక ఈ ఏడాది వీరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వీరికి విడాకులు సైతం మంజూరు అయ్యాయి.
ఇక నిహారిక తన సినిమాలతో తను బిజీగా గడుపుతుంది. సోషల్ మీడియా వేదికగా కూడా తను చాలా యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫోటోలు షేర్ చేస్తూ... అందాల ఆరబోత కూడా మొదలు పెట్టింది. ఈ మధ్య ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఆ మధ్య యూట్యూబర్ నిఖిల్ తో లవ్ అఫైర్ అంటూ వస్తున్న వార్తలకు ఆమె చెక్ పెట్టింది కూడా. నిఖిల్ బర్త్ డే సందర్భంగా బ్రో అంటూ విష్ చేయడంతో ఆ వార్తలకు నిహారిక బ్రేక్ వేసినట్లు అయింది.
ఇక జోన్నల గడ్డ చైతన్య విషయానికి వచ్చేసరికి విడాకలు తర్వాత అతను కూడా తన పని చూసుకుంటున్నాడు. అయితే ఇంకో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. జోన్నల గడ్డ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిహారికతో విడాకులు వచ్చేశాయి కాబట్టి రెండో పెళ్లికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. జోన్నలగడ్డ చైతన్య బంధువుల అమ్మాయిని చేసుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ గా మారాయి.

ఇక అమ్మాయి విషయానికి వస్తే... వాళ్ల ఫాదర్ ఓ పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తోంది. త్వరలో వీరి పెళ్లి జరగనుందని... ఇంట్లో వాళ్లు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ... నెట్టింట మాత్రం వైరల్ గా మారాయి. ఇక నిహారిక హ్యాండ్ ఇచ్చి చైతన్య రెండో పెళ్లి చేసుకోవడంపై ఆమె ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











