Pushpa 2లో నిహారిక.. పుష్పరాజ్‌కే ట్విస్ట్ ఇచ్చేలా.. ఏ పాత్ర చేస్తుందో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది!
తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిత్రాలకు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే మన సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో విజయాలను అందుకుంటోన్నాడు. అలా రెండేళ్ల క్రితం వచ్చి ఉత్తరాది మొత్తాన్ని షేక్ చేసేసిన సినిమానే 'పుష్ప ది రైజ్'.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో తెలిసిందే. ఇక, ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్' రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇందులో నిహారిక కొణిదెల నటిస్తున్నట్లు ఓ న్యూస్ లీకైంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!

అంతటా పుష్ప మేనియానే: సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ మూవీనే 'పుష్ప ది రైజ్'. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో విడుదలైంది. దీనికి అన్ని చోట్లా భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. అంతేకాదు, పుష్ప చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించి రికార్డులు కొట్టింది.

రూల్ చేయడానికి సిద్ధంగా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప ది రైజ్' సూపర్ హిట్ అవడంతో.. రెండో పార్టుపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. 'పుష్ప.. ది రూల్' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో పుష్ప రూలర్‌గా ఎలా మారాడు అన్న విషయాన్ని హైలైట్ చేసి చూపించబోతున్నారు. ఈ చిత్రాన్ని మొదటి భాగం కంటే హై రేంజ్‌లో తీస్తున్నారని ఫిలిం నగర్‌లో టాక్ వినిపిస్తోంది.

స్పీడ్‌గా షూట్.. అందులో: 'పుష్ప ది రూల్' మూవీపై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. అందుకే దీనికి సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే షూటింగ్‌ను కూడా మొదలెట్టారు. ఇలా దాదాపు 40 శాతానికి పైగానే షూటింగ్ కూడా పూర్తైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జోరుగా సాగుతోంది.

భారీ రెస్పాన్స్... రెట్టింపు: 'పుష్ప ది రూల్' కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ వీడియోను విడుదల చేశారు. దీనికి అన్ని భాషల్లోనూ అదిరిపోయే స్పందన వచ్చింది. ఫలితంగా అత్యధిక వ్యూస్‌తో ఇది రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి.
పుష్ప 2లో మెగా డాటర్: 'పుష్ప ది రూల్' మూవీ గురించి కొంత కాలంగా ఎన్నో రకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో ఫలానా వాళ్లు కీలక పాత్రలను పోషిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో మెగా డాటర్ నిహారిక కూడా నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

పుష్పరాజ్‌కే ట్విస్ట్ ఇస్తూ: అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న 'పుష్ప ది రూల్' మూవీలో ముఖ్యమైన ఓ గిరిజన యువతి పాత్రనే నిహారిక కొణిదెల చేస్తుందని తాజాగా ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, ఆమె ఇందులో ఊహించని లుక్‌లో కనిపించబోతుందని, కొన్ని సాహసాలు కూడా చేయబోతుందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించగా ఆమె రిజెక్ట్ చేసిందట.

సినిమాకు టర్నింగ్ ఇదే: ఫిలిం నగర్ ఏరియాలో జరుగుతోన్న ప్రచారం ప్రకారం.. 'పుష్ప ది రూల్' మూవీలో నిహారిక పోలీస్ ఇన్‌ఫార్మర్ పాత్రను చేస్తుందట. గిరిజన యువతిగా పుష్పరాజ్ పక్కనే ఉంటూ అతడి సమాచారాన్ని పోలీసులకు అందజేస్తుందని తెలిసింది. ఈ విషయం రివీల్ అయిన సమయంలో అందరూ షాక్ అవుతారని అంటున్నారు. దీంతో ఇప్పుడీ వార్త హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











