‘ఆచార్య’ స్టోరీ లీక్ చేసిన నిహారిక.. కోపంలో చిరంజీవి తీసుకున్న నిర్ణయం ఇదే.!
సాధారణంగా సినీ కుటుంబాలకు చెందిన వారు తమ కుమారులను వారసులుగా పరిచయం చేస్తుంటారు. బాలీవుడ్‌లోనైతే దీనికి భిన్నంగా తమ కుమార్తెలను సైతం ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన వారు చాలా మందే ఉన్నారు. సరిగ్గా ఇదే చేసింది మెగా ఫ్యామిలీ. టాలీవుడ్‌లోనే బడా ఫ్యామిలీల్లో ఒకటిగా వెలుగొందుతోన్న ఈ కుటుంబం నుంచి మెగా డాటర్ నిహారిక సినిమాల్లోకి ప్రవేశించింది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. అప్పటి నుంచి ఈమె ఏదో ఒకటి చేస్తూ హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలో నిహారిక 'ఆచార్య' స్టోరీ లీక్ చేసింది. ఆ వివరాలు మీకోసం.!
Recommended Video

‘ఢీ' అంటూ వచ్చింది.. ఢీలా పడిపోయింది
ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘ఢీ' అనే డ్యాన్స్ షో ద్వారా నిహారిక బుల్లితెరపైకి ఎంటర్ అయింది. అందులో ఆమె చేసిన యాంకరింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ‘ఒక మనసు' అనే మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇది ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్', ‘సూర్యకాంతం' కూడా నిరాశ పరిచాయి.

అందులో మాత్రం సత్తా చాటుతోన్న నిహారిక
వరుస పరాజయాలతో సతమతం అయిన నిహారిక హీరోయిన్‌గా నటించడమే మానేసింది. అయితే, గతంలో తనకు పేరు తెచ్చిన వెబ్ సిరీస్‌లను మాత్రం కంటిన్యూ చేస్తోంది. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే సొంత బ్యానర్‌పై ‘ముద్దపప్పు ఆవకాయ్', ‘నాన్న కూచీ' వంటి సూపర్ హిట్ సిరీస్‌లను అందించిన ఆమె.. ఇటీవల ‘మ్యాడ్ హౌస్'తో మరోసారి ఆకట్టుకుంది.

హాట్ ఫొటోలు.. వాటిలో కూడా నటిస్తుందట
షూటింగులు ఉన్నా.. లేకున్నా నిహారిక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అంతేకాదు, తన సినీ విషయాలను కూడా చెబుతోంది. ఇక, ఈ మధ్య హాట్ హాట్ ఫొటోలతో రచ్చ రచ్చ చేసింది. అదే సమయంలో గ్లామర్ పాత్రలు చేయబోతున్నట్లు ప్రకటించింది.

లక్కీ ఛాన్స్ కొట్టేసింది.. కోరిక తీర్చుకుంది
మెగా ఫ్యామిలీకి ఆద్యుడు అయిన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఎవరికి ఉండదు. ఈ జాబితాలో నిహారిక కూడా ఉంది. ఎప్పటికైనా తన పెదనాన్న సినిమాలో నటించాలని కలలు కంటూ ఉండే ఆమెకు.. ‘సైరా: నరసింహారెడ్డి'లో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీలో చిన్న పాత్రలో కనిపించిన మెగా డాటర్.. తన చిరకాల కోరికను తీర్చుకుంది.

చిరంజీవి.. రామ్ చరణ్.. మధ్యలో నిహారిక
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఆచార్య'. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను రామ్ చరణ్, మ్యాట్నీ మూవీస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవాదాయ భూముల ఆక్రమణలపై పోరాటం చేసే వ్యక్తి కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో నిహారిక కూడా కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది.

‘ఆచార్య' స్టోరీ లీక్ చేసిన మెగా హీరోయిన్
తాజాగా ఈ సినిమాలో నిహారిక చేసే రోల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో ఆమె రామ్ చరణ్‌కు చెల్లెలి పాత్రను పోషిస్తుందట. కొద్ది సేపు మాత్రమే ఉండే ఈ పాత్ర సినిమా కథను మలుపు తిప్పుతుందని అంటున్నారు. అంతేకాదు, ఇందులో నిహారిక పల్లెటూరుకు చెందిన అమ్మాయిగా నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది.

కోపంలో చిరంజీవి తీసుకున్న నిర్ణయం ఇదే.!
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ చనిపోతాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అతడి స్టోరీని చిరంజీవికి చెప్పేది నిహారికేనట. దీంతో చిరంజీవి రౌడీ గ్యాంగ్ మీద కోపంతో వాళ్లు చేసే మోసాన్ని బయట పెడతాడని తెలుస్తోంది. అంతేకాదు, చరణ్‌ను చంపిన వాళ్లపై పగను కూడా తీర్చుకుంటాడని సమాచారం.


Click it and Unblock the Notifications











