నిహారిక నయా స్కెచ్.. చిరంజీవి, నాగబాబుకు చెప్పి మరీ! మెగా డాటర్ సంచలనం
మెగా డాటర్ కొణిదెల నిహారిక ఓ నిర్ణయానికి వచ్చేసిందని తెలుస్తోంది. హీరోయిన్ కావాలన్న ఆకాంక్షతో 'ఒక మనసు' సినిమాతో సినీ గడప తొక్కిన ఈమె.. 'హ్యాపీ వెడ్డింగ్' లాంటి సినిమాలు చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. ఇటీవలే సైరాలో కూడా చిన్న పాత్ర పోషించింది. ఇవేవీ తన కెరీర్‌కి కలసి రాకపోవడంతో ఆమె సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

నిహారిక మూడు సినిమాలు.. ఫలితం
కొణిదెల నిహారిక లీడ్ రోల్‌లో ఇప్పటికి మూడు సినిమాలు వచ్చాయి. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ తర్వాత సూర్యకాంతం సినిమా చేసిన ఆమె మరో డిసాస్టర్ తన ఖాతాలో వేసుకుంది. దేంతో కనీసం కథల ఎంపిక కూడా నిహారికకు చేత కావడం లేదంటూ విమర్శలు వచ్చాయి. ఇది గమనించి నిహారిక ఓ నిర్ణయం తీసుకుందనే టాక్ బయటకొచ్చింది.

ఇకపై సినిమాలకు గుడ్ బై
ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పేయాలని కొణిదెల నిహారిక భావిస్తోందట. ఈ మేరకు తన నిర్ణయాన్ని ఓపెన్‌గా కుటుంబ సబ్యులకు చెప్పేసిందని సమాచారం. మూడు సినిమాలు చేసినా కూడా ఇప్పటి వరకు కనీస గుర్తింపు కూడా రాకపోవడం ఆమెను బాధ పెట్టిందని, అందుకే ఇక సినిమాలకు టాటా చెప్పేయాలని ఆమె భావిస్తోందట.

చిరంజీవి, నాగబాబుకు చెప్పి మరీ!
నటిగా తానేంటో నటిగా నిరూపించుకోవాలనే కసితోనే సినిమాల్లోకి వచ్చిన ఆమెకు పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. ఇక సినిమాల్లో ఇక నటించకూడదని డిసైడ్ అయిన నిహారిక.. తన నిర్ణయాన్ని చిరంజీవి, నాగబాబుకు కూడా చెప్పేసిందని ఫిలిం నగర్ టాక్.

కాస్త మోడ్రెన్ ఆలోచన.. నిహారిక ప్లాన్
ఇదే సందర్భంలో నిహారిక కాస్త మోడ్రెన్ ఆలోచన చేసిందని తెలుస్తోంది. ఇకపై సినిమాలు ఆపేసి హాయిగా వెబ్ సిరీస్‌లు చేసుకోవాలని నిహారిక ప్లాన్ చేస్తోందట.
ఈ నేపథ్యంలో ఇప్పటికే 'పింక్ ఎలిఫెంట్' పేరుతో నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించిన నిహారిక.. ఇదే బ్యానర్‌పై 'నాన్నకూచి', 'ముద్దపప్పు ఆవకాయ్' వెబ్ సిరీస్‌లను నిర్మించింది.
Recommended Video

నిహారిక ఆన్‌లైన్ కెరీర్
ప్రస్తుతం మ్యాడ్ హౌజ్ అనే వెబ్ సిరీస్ నిర్మాణంలో బిజీగా ఉంది కొణిదెల నిహారిక. ఈ వెబ్ సిరీస్ ఏకంగా 100 ఎపిసోడ్స్ ఉండేలా డిజైన్ చేయడం విశేషం. ఇందులో నిహారిక కూడా ఓ రోల్ పోషిస్తోంది. సో ఈ లెక్కన ఇక సినిమాలు కాదు, కేవలం వెబ్ సిరీస్‌లు మాత్రమే అనుకుంటుందన్న మాట నిహారిక. చూడాలి మరి
ఆన్ లైన్ వేదికపై ఆమె కెరీర్ ఎలా ఉంటుందో.!


Click it and Unblock the Notifications











