నిహారిక కొణిదెల కొత్త లవ్ స్టోరీ.. మెగా ఫ్యామిలీ సమక్షంలోనే ప్రకటన!

టాలీవుడ్‌లోకి చాలా మంది సినీ వారసులు వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమ కూతుళ్లను కూడా పరిచయం చేశారు. అలా వచ్చిన వారిలో మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒకరు. టీనేజ్‌లో ఉన్నప్పుడే గ్లామర్ ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. హీరోయిన్‌గా అంతగా సక్సెస్ కాలేకపోయింది.

ఫలితంగా మరోసారి అలాంటి ప్రయత్నమే చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నిహారిక కొత్త లవ్ స్టోరీతో రాబోతుంది. ఇంతకీ ఆమె ఏం చేయబోతుంది? ఆ ప్రకటన ఎప్పుడు రాబోతుంది? అనే అంశాలపై పూర్తి సమాచారాన్ని మీరే చూసేయండి మరి!

Niharika Konidela To Do a Film With Vaishnav Tej

హీరోయిన్‌గా ఫెయిల్: చిన్న వయసులోనే 'ఢీ' షోను హోస్ట్ చేసిన నిహారిక.. ఆ తర్వాత 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ స్థాపించి.. 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' వంటి సిరీస్‌లను చేసింది. కొన్నేళ్ల తర్వాత 'ఒక మనసు' మూవీతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' మూవీలు చేసింది. కానీ, ఇవి హిట్ కాకపోవడంతో నిహారిక ఫెయిల్ అయింది.

Niharika Konidela To Do a Film With Vaishnav Tej

ఈ మధ్య ఫుల్ స్పీడు: సినిమాలకు గ్యాపిచ్చిన సమయంలోనే నిహారికకు చైతన్యతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె యాక్టింగ్ కెరీర్‌ను ఆపేయాల్సి వచ్చింది. కానీ, నిర్మాతగా మాత్రం పలు సిరీస్‌లను చేసింది. ఇక, గత ఏడాది చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మాత్రం నిహారిక వరుసగా ప్రాజెక్టులు చేస్తోంది. ఇందులో భాగంగానే 'డెడ్ ఫిక్సల్' సిరీస్‌లో రచ్చ చేసేసింది.

Niharika Konidela To Do a Film With Vaishnav Tej

నిహారిక మళ్లీ హోస్ట్: యాక్టింగ్‌ కెరీర్‌ను పున: ప్రారంభించిన నిహారిక కొణిదెల.. స్పీడు పెంచేసి మరీ కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ వెళ్తోంది. ఇలా ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లతో పాటు పలు చిత్రాలకు సైతం సంతకం పెట్టేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆహాలో ప్రసారం అవుతోన్న 'చెఫ్ మంత్ర' షోను హోస్ట్ చేస్తుంది. ఇది మార్చి 3వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

Niharika Konidela To Do a Film With Vaishnav Tej

నిహారిక కొత్త ప్రాజెక్ట్: ఇప్పటికే జెట్ స్పీడుతో ప్రాజెక్టులు లైన్‌లో పెట్టుకుంటోన్న మెగా డాటర్ నిహారిక కొణిదెల.. హీరోయిన్‌గానూ మరింత వేగంగా దూసుకుపోవాలని ప్లాన్ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే త్వరలోనే మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి ఓ క్రేజీ సినిమాను చేయబోతుందని తెలిసింది. ఈ చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నాడని ఫిలిం నగర్ సమాచారం.

Niharika Konidela To Do a Film With Vaishnav Tej

డిఫరెంట్ లవ్ స్టోరీ: మెగా డాటర్ నిహారిక - పంజా వైష్ణవ్ తేజ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాను డిఫరెంట్ లవ్ స్టోరీతో తెరకెక్కించబోతున్నారని కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది. గతంలో ఏ తెలుగు సినిమాలోనూ టచ్ చేయని పాయింట్‌తో దీన్ని రూపొందించబోతున్నారట. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది.

Niharika Konidela To Do a Film With Vaishnav Tej

మెగా ఫ్యామిలీతోనే: పంజా వైష్ణవ్ తేజ్ - నిహారిక కొణిదెల జంటగా నటించబోతున్న సినిమాకు సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని సమాచారం. మెగా ఫ్యామిలీలోని హీరోలు అందరి సమక్షంలోనే ఈ సినిమాను ప్రారంభించబోతున్నారని కూడా అంటున్నారు. దీంతో టాలీవుడ్‌లో ఇప్పుడీ మెగా ప్రాజెక్టు న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X