నిహారికకు సర్‌ప్రైజ్ చిరంజీవి గిఫ్ట్ .. భారీ ప్రాజెక్టులో భాగస్వామిగా మెగా డాటర్!
తెలుగు తెరపై తిరుగులేని హీరోగా పేరొందిన అతి తక్కువ మందిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంటర్ అయిన ఆయన.. పెద్ద పెద్ద హీరోల నుంచి పోటీని ఎదుర్కొని నిలదొక్కుకోగలిగాడు. కెరీర్ ఆరంభంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరో అయిపోయాడు. ఇక, సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి దూకుడు ప్రదర్శిస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా నిహారికకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...

కొంచెం ఉత్సాహం.. ఇంకొంచెం నిరుత్సాహం
సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150'తో ఆయన సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఈ సినిమా చిరుపై ఉన్న ఎన్నో అనుమానాలకు సమాధానం చెప్పింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి' మాత్రం ఆశించినంతగా ఆడలేకపోయింది.

రామ్ చరణ్ భారీ ప్లాన్.. ఈ సారి ఆయనతో
రీఎంట్రీలో చిరంజీవి చేసిన రెండు సినిమాలను నిర్మించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పుడు మరోసారి తన సొంత బ్యానర్‌లో తండ్రితో సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘ఆచార్య' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. చెర్రీతో పాటు మ్యాట్నీ మూవీస్ సంస్థ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

అసలైనవే రివీల్ అయ్యాయి.. ఫ్యాన్స్ ఖుషీ
ఈ సినిమా అనుకున్నప్పటి నుంచే కథపై క్లారిటీ వచ్చేసింది. తన గత చిత్రాల మాదిరిగానే దీన్ని కూడా సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల. దేవాదాయ భూముల ఆక్రమణలపై పోరాటం చేసే వ్యక్తి కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో చిరు.. నక్సలైట్‌గా కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించిన లుక్ కూడా లీక్ అవగా.. టైటిల్‌ను మెగాస్టారే రివీల్ చేశారు.

రామ్ చరణ్.. మహేశ్ బాబు.. ఫిక్స్ అయ్యారిలా
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘ఆచార్య' సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడని మొదట్లో ప్రచారం జరిగింది. అయితే, ఈ మధ్య సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, ఇటీవల చెర్రీనే ఫైనల్ చేశారని అంటున్నారు. అంతేకాదు, అతడు కూడా నక్సలైట్‌గానే నటిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.

నిహారికకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
కరోనా ప్రభావంతో ‘ఆచార్య' సినిమా షూటింగ్ నిలిచిపోయింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన టెక్నికల్ వర్క్‌తో పాటు కాస్ట్‌ను ఎంపిక చేయాలని కొరటాల శివ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి.. తన సోదరుడు నాగబాబు కుమార్తె నిహారికకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడని తాజాగా ఓ న్యూస్ తెలుగు సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
Recommended Video

భారీ ప్రాజెక్టులో భాగస్వామి అయిన మెగా డాటర్.!
హీరోయిన్‌గా వరుస పరాజయాలను చవి చూసింది మెగా డాటర్ నిహారిక. దీంతో ఆమె సినిమాలకు దూరం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తన ‘ఆచార్య' మూవీలో ఆమెకు అవకాశం కల్పించాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే ‘సైరా: నరసింహారెడ్డి' మూవీలో పెదనాన్నతో కలిసి నటించిన నిహారిక.. ఇందులో ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని సమాచారం.


Click it and Unblock the Notifications











