పెళ్లికి ముందు రొమాంటిక్ కథలో నిహారిక.. ప్రాజెక్ట్ సెట్ చేసిన మెగా డాటర్
నాగబాబు కూతురు నిహారిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. తన డ్రీమ్ బాయ్ దొరకడంతో అమ్మడి ఆనందానికి అవధులు లేవని సోషల్ మీడియాలో ఆమె సంబరం చూస్తుంటే అర్ధమవుతోంది. ఇటీవల తన భర్త పుట్టినరోజు సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి తరువాత నిహారిక సినిమాల్లో కొనసాగుతుందో లేదో తెలియదు గాని పెళ్లికి ముందు మాత్రం ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

నటనతో ఆకట్టుకుంది.. కానీ..
నాన్నకూచి అంటూ వెబ్ సిరిస్ తో ఓ వర్గం ఆడియెన్స్ లో మంచి క్రేజ్ అందుకున్న నిహారిక ఆ తరువాత యాంకర్ గానే కాకుండా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి నటనతో బాగానే గుర్తింపు దక్కించుకుంది. కానీ ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక మొత్తానికి అమ్మడు సరైన వయసులో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది.

ఆగస్టులో ఎంగేజ్మెంట్..
పోలీస్ అధికారుడి కుమారుడైన చైతన్య జొన్నలగడ్డ అనే యువకుడిని పెళ్లాడబోతున్న నిహారిక ఎంగేజ్మెంట్ డేట్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వరుణ్ తేజ్ కూడా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఆగస్టులోనే నిశ్చితార్థం జరగనుందని చెబుతూ.. పెళ్లి డిసెంబర్ లో జరిగే అవకాశం ఉందని రూమర్స్ కి చెక్ పెట్టాడు.

మెగా డాటర్ నిర్మాతగా..
ఇక పెళ్లికి ముందు నిహారిక ఒక వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ప్రాజెక్టును మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సుస్మిత ఒక ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓయ్ దర్శకుడు ఆనంద్ రంగతో ఒక వెబ్ కంటెంట్ ని కూడా స్టార్ట్ చేశారు.
Recommended Video

పెళ్లికి ముందు రొమాంటిక్ సినిమా?
ఇక నెక్స్ట్ నిహారికతో ఒక రొమాంటిక్ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పెళ్లి తరువాత నిహారిక సినిమాలు చేస్తుందా లేదా అనే విషయంలో అనేక రకాల ఊహాగానాలు వస్తున్నాయి. పెళ్లి అయితే డిసెంబర్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఓకవేళ పరిస్థితులు అనుకూలించాకపోతే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











