twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీహారిక రెండో చిత్రం ఖరారు..కథ ఇదే? చనిపోయే పాత్రే?

    By Srikanya
    |

    హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నీహారిక కొణిదెల తొలి చిత్రం ఒక మనసు కమర్షియల్ గా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది. అయితే ఆమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపద్యంలో నీహారిక తన తదుపరి చిత్రం విషయమై ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఈ సారి ప్రశంసలు తో పాటు సినిమా హిట్ ను కూడా ఆమె కోరుకుంటోంది. అందులో భాగంగా ఆమె ఓ రీమేక్ ని ఎంచుకున్నట్లు సమాచారం.

    అందుతున్న సమాచారం ప్రకారం... నీహారిక తన రెండవ సినిమాగా మరాఠీ హిట్ సినిమా "హ్యాపీ జర్నీ" లో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా అన్నాచెల్లెల అనుబంధం ప్రధానంగా సాగుతుంది. అన్నా చెల్లెల మధ్య అనుబంధం ఆధారంగా నడిచే ఈ కధలో చెల్లెలు పాత్ర నటనలో మంచి స్కోప్ ఉన్న పాత్ర కావటంతో ఆమె వెంటనే ఓకే చేసిందని చెప్తున్నారు. ఆ చిత్రం ట్రైలర్ ఇక్కడ చూడండి.

    ఈ చిత్రం నీహారిక పాత్ర మరణిస్తుంది. చెల్లెలు మరణించిన తర్వాత కూడా అన్న పై ఉన్న ప్రేమతో అన్నకు సాయం చెయ్యడానికి దెయ్యంగా మరి అక్కడే తిరుగుతూ.. అన్నకు సాయం చేసి చివరకు మాయమై పోతుంది. ఈ రోల్ లో నటన కు ఆస్కారం ఉన్నందున నీహారిక అంగీకరించినట్లు సమాచారం. అన్నగా హర్ష వర్ధన్ రాణే నటిస్తోండగా... బెక్కం వేణుగోపాల్ నిర్మించనున్నారు. త్వరలో ఈ సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారట.

    అయితే ట్విస్ట్ ఏమిటంటే...... తొలి చిత్రం ఒక మనసులోనూ నీహారిక పాత్ర చనిపోతుంది. రెండో చిత్రంలోనూ ఆమె పాత్ర చనిపోయి దెయ్యంగా మారుతుంది. అసలు ఇలా చనిపోయే పాత్రలు ఎంచుకోవటం ఏమిటి అంటున్నారు. మరి నీహారిక స్ట్రాటజీ ఏమిటో చూడాలి మరి.

    Niharika's next remake of Happy Journey

    నీహారిక మాట్లాడుతూ ''హీరోయిన్‌గా పరిశ్రమలోకి వద్దామనుకోగానే నా దగ్గరకు చాలా కథలొచ్చాయి . నా కన్నా ముందు సినిమా బ్యాగ్రౌండ్‌ ఉన్న హీరోయిన్‌లు చాలామంది వచ్చారు. వారు ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు. హీరోయిన్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు నాన్నతో చెప్పా. తర్వాత పెదనాన్న దగ్గరికెళ్లా. ఇంట్లో అందరి అంగీకారంతోనే ఎంట్రీ ఇచ్చా. సినిమా పట్ల నాకున్న ఇష్టాన్ని అభిమానులు అర్ధం చేసుకుని మంచి సపోర్ట్‌ ఇస్తున్నారు.

    ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండాలనే గోల్స్‌ నాకేమీలేవు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ చూసుకుంటా. గ్లామర్‌ క్యారెక్టర్స్‌ అంటే ఇంట్రెస్ట్‌ లేదు. తెలుగులో మాత్రమే కాదు తమిళ, మలయాళ భాషల్లో కూడా యాక్ట్‌ చేయాలనుకుంటున్నా. టీవీ షోస్‌ నా జీవితానికి కీలకమైనవి.

    బ్యాగ్రౌండ్‌ అనేది మొదటి సినిమాకే ఉపయోగపడుతుంది. స్వయంకృషితో మన టాలెంట్‌ని ప్రూవ్‌ చేసుకోకపోతే పరిశ్రమలో నిలబడటం కష్టమని నాకు తెలుసు. స్వయంకృషి అనేది మా ఇంటి ఫార్ములా. కష్టమంటే ఏంటో పెదనాన్నని చూశాకే తెలిసింది. అందుకే ఇప్పటికీ, ఎప్పటికీ నా రోల్‌ మోడల్‌ చిరంజీవి నాన్నే'' అని వివరించారు.

    అలాగే ''మెగా హీరోయిన్ లేదా వారసురాలు అనిపించుకోవాలంటే ఓ అర్హత ఉండాలి. 'మెగా' అనే ట్యాగ్‌ చాలా భారమైనది. ఒక రాత్రిలో వచ్చిన గుర్తింపు కాదది. పెదనాన్నగారి కొన్నేళ్ల కష్టం. వద్దన్నా అభిమానులు ఆ ట్యాగ్‌ ఇవ్వకుండా ఊరుకుంటారా? నాకు ఆ అర్హత వచ్చినప్పుడు నేనే చెప్పుకుంటా'' అని నీహారిక కొణిదెల చెప్పారు.

    English summary
    Niharika’s second film will be the Telugu remake of Marathi film, Happy Journey. The film is an emotional drama of two siblings, a sister who hardly has seen her brother in her life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X