Niharika: విడాకుల తర్వాత నిహారిక ఊహించని పని.. మంగళసూత్రం ఏం చేసిందో తెలిస్తే!

గ్లామర్ ఫీల్డులో లవ్ ట్రాకులు, పెళ్లిళ్లు, బ్రేకప్‌లు అనేవి సర్వసాధారణంగా కనిపించే అంశాలే అన్న విషయం తెలిసిందే. అన్ని ఇండస్ట్రీల్లోనూ తరచూ ఇలాంటి పరిణామాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇలా కొన్నేళ్ల క్రితం పెద్దల సమక్ష్యంలో పెళ్లి చేసుకుని.. తాజాగా విడాకులు తీసుకున్నారు నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ.

వీళ్లిద్దరూ విడిపోయిన తర్వాత ఈ మాజీ జంట గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతునే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా నిహారిక మంగళసూత్రాల గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందో మీరే చూడండి మరి!

 Niharika Sends Her Mangalsutra to Ex Husband Chaitanya After Divorce

నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్: నిహారిక కొణిదెలకు రెండేళ్ల క్రితమే చైతన్య జొన్నలగడ్డతో వివాహం జరిగింది. తన కుమార్తెకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని భావించిన నాగబాబు.. అందుకు అనుగుణంగానే ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్‌లో వీళ్ల పెళ్లి జరిపించారు. దీనికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. అప్పట్లో వీళ్ల పెళ్లి సెన్సేషన్ అయిపోయింది.

 Niharika Sends Her Mangalsutra to Ex Husband Chaitanya After Divorce

ఫుల్ ఎంజాయ్ చేసేశారు: మ్యారేజ్ చేసుకున్న తర్వాత నిహారిక, చైతన్య ఎంతో క్రేజీగా గడిపారు. తరచూ పార్టీలు చేసుకోవడం, హాలీడే ట్రిప్‌లకు వెళ్లడం వంటివి చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటూ వచ్చారు. అదే సమయంలో ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉంటూ ఎన్నో విజయాలను కూడా ఖాతాల్లో వేసుకున్నారు.

 Niharika Sends Her Mangalsutra to Ex Husband Chaitanya After Divorce

విడాకులు తీసుకున్నారు: తక్కువ సమయంలోనే బెస్ట్ కపుల్‌గా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నిహారిక - చైతన్య విడాకులు తీసుకున్నారు. తద్వారా రెండున్నరేళ్ల తమ వివాహ బంధానికి పుల్‌స్టాప్ పెట్టేశారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఇకపై తామిద్దరం భార్యా-భర్తలుగా కొనసాగలేమని, తమకు కాస్త ప్రైవసీని ఇవ్వాలని కోరుతూ పోస్టులు పెట్టారు.

 Niharika Sends Her Mangalsutra to Ex Husband Chaitanya After Divorce

విడాకులపై అనుమానం: నిహారిక - చైతన్య విడాకులు తీసుకుంటున్నారని చాలా రోజులుగా వార్తలు వచ్చిన సమయంలోనే వాళ్లు దీన్ని నిజం చేసేశారు. దీంతో ఇప్పుడు అసలు వీళ్లిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు? దీని వెనుక కారణాలు ఏంటి? వీళ్లిద్దరి మధ్య ఏ విషయాల్లో మనస్పర్థలు వచ్చాయి? ఇలా రకరకాల అనుమానాలకు మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదనే చెప్పుకోవాలి.

 Niharika Sends Her Mangalsutra to Ex Husband Chaitanya After Divorce

మంగళసూత్రం హైలైట్: గతం వారంలోనే చైతన్య, నిహారికకు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాతనే వీళ్లిద్దరూ డివోర్స్ గురించి అధికారికంగా ప్రకటించారు. ఈ వ్యవహారం తర్వాత ఎన్నో రకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత మంగళసూత్రం ఏం చేసింది అన్న దానిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో చర్చలు జరుగుతున్నాయి.

తాళిని అలా చేసేసిందా?: రెండున్నరేళ్ల క్రితం చైతన్య కట్టిన మంగళసూత్రాన్ని విడిపోయిన తర్వాత కూడా నిహారిక తన దగ్గరే ఉంచుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం దాన్ని తన మాజీ భర్త చైతన్యకు ఆమె పంపించేసిందని అంటున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఇది ఇప్పుడు ఓ రేంజ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

 Niharika Sends Her Mangalsutra to Ex Husband Chaitanya After Divorce

అందుకే పంపించిందట: హిందూ సంప్రదాయంలో ఎక్కువ మంది ఆచరించే దాని ప్రకారం.. తాళిబొట్టులోని మంగళసూత్రాలను అత్తింటి వారు ఒకటి.. పుట్టింటి వారు ఒకటి పెడతారు. కొందరు మాత్రం రెండింటినీ మెట్టినింటి నుంచే పెళ్లికూతురికి గిఫ్టుగా ఇస్తారు. ఇలా పెళ్లి సమయంలో చైతన్య వాళ్లు నిహారికకు దాన్ని ఇచ్చారట. అందుకే ఇప్పుడు తాళిని అత్తింటి వాళ్లకు పంపిందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X