బాలీవుడ్ సూపర్ హిట్ రీమేక్ లో నిఖిల్
హైదరాబాద్ : రీసెంట్ గా సూర్య వెర్శస్ సూర్య చిత్రం చేసిన నిఖిల్ ఈ సారి ఓ బాలీవుడ్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఆ చిత్రం మరోదో కాదు...పస్ గయారే ఒబామా. బాలీవుడ్ లో లో బడ్జెట్ లో నిర్మితమైన సూపర్ హిట్ కామెడీ చిత్రం ఇది. యుదయ్ నందనవనం డైరక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏమీ లేదు.
మరో ప్రక్క నిఖిల్ తాజాగా మరో కొత్త ప్రాజెక్టు చేయడానికి సిద్ధమయ్యాడు. వైవిధ్యభరితమైన టైటిల్ ‘శంకరాభరణం' చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని కోన వెంకట్ నిర్మిస్తున్నారు.18 నుంచి 25 సంవత్సరాల లోపు అమ్మాయిలు, అబ్బాయిలు కావాలని కాస్టింగ్ కాల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కోన వెంకట్ ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని తెలియచేసారు. తాము రూపొందిస్తున్న క్రైమ్ కామెడీ శంకరా భరణం కు... మినిమం రెండు షార్ట్ ఫిలిలు చేసిన లేదా ఓ ఫీచర్ ఫిల్మ్ చేసిన వారు కావాలని అన్నారు. వారు తమ వర్క్...కేవలం రెండు నిముషాలు పంపమన్నారు. షార్ట్ ఫిలిలు మొత్తం పంపవద్దని చెప్పారు. వాళ్లలో కొందరిని షార్ట్ లిస్ట్ చేసి, వాళ్లని ఆడిషన్స్ కు పిలుస్తామని చెప్పారు. అలాగే తనకు పర్సనల్ గా ఎవరూ మెయిల్స్,మెసేజ్ లు పంపవద్దని కోరారు.
కొత్త దర్శకుడైన ఉదయ్ నందనవనం ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ఈ చిత్రానికి కథ, మాటలు కోన వెంకట్ అందిస్తున్నాడు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదో క్రైమ్ కామెడీ చిత్రంగా రూపొందనుందని ఫిలింనగర్ సమాచారం.
ఇంతకుముందు కోన వెంకట్..అంజలి ప్రధాన పాత్రలో గీతాంజలి అనే హర్రర్ కామెడీని నిర్మించి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా అన్ని రకాల ఎలిమెంట్ లతో డిఫెరెంట్ గా సాగుతుందని చెప్తున్నారు. ‘ శంకరాభరణం' : కోన వెంకట్-నిఖిల్ కాంబినేషన్ లో... ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ రైటర్ గా కెరీర్ సాగిస్తున్న రచయితల్లో కోన వెంకట్ ఒకరు.

ఆయన ఏ సినిమాకు పని చేసినా.....ఆ సినిమా బాగా ఆడుతుందనే పేరు ఉంది. ఆయన రాసే డైలాగ్స్, స్క్రీన్ ప్లే కోసం పలువురు దర్శకులు, హీరోలు ఎదురు చస్తారంటే ఆయనకున్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నిఖిల్ కోసం కథను ప్రస్తుతం తయారు చేసినట్లు తెలుస్తోంది. నిఖిల్ బాడీ లాంగ్వేజికి తగిన విధంగా కోన వెంకట్ కథ తయారు చేసారని అంటున్నారు.
పూర్తి వినోదాత్మకంగా సాగే కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఉంటూనేై క్రైమ్ ఎలిమెంట్ ఈ చిత్రంలో ఉండనుంది. సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తానరి తెలుస్తోంది. ఆయన కోసం కోన వెంకట్ స్పెషల్ క్యారెక్టర్ క్రియేుట్ చేసినట్లు తెలుస్తోంది. కధల ఎంపికలో నిఖిల్ చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
'కార్తికేయ' సినిమా విజయంతో మంచి డిమాండులోకి వచ్చిన నిఖిల్ ప్రస్తుతం 'సూర్య వెర్సస్ సూర్య' అనే సినిమాలో నటించాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన‘సూర్య వర్సెస్ సూర్య' భాక్సాఫీస్ వద్ద అనుకున్న విధంగా వర్కవుట్ కాలేదు. గతంలో పలు చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ గా పరిచయం అయ్యారు.


Click it and Unblock the Notifications











