twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో నిఖిల్ మళ్లీ కష్టకాలం.. దెబ్బ మీద దెబ్బ అంటే ఇదేనేమో..

    |

    గత కొద్దికాలంగా యువ హీరో నిఖిల్ సిద్ధార్థ‌కు ఫ్లాపుల పరంపర కొనసాగుతున్నాయి. వరుసగా సినిమాలు పరాజయం పొందుతుండటంతో ముద్ర సినిమాపై గంపెడు ఆశలు పెట్టుకొన్నారు. అయితే ఆ సినిమా నిఖిల్‌కు లేనిపోని టెన్షన్లు పెడుతున్నది. దీంతో యువ హీరో పరిస్థితి గందరగోళంగా మారిందనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

    ముద్ర మూవీపైనే

    ముద్ర మూవీపైనే

    ఎక్కడికి పోతావు చిన్నదాన సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో నిఖిల్ కెరీర్ ఇక గాడిన పడినట్టేనని అందరూ అనుకొన్నారు. ఆ తర్వాత కేశవ, కిర్రాక్ పార్టీ డిజాస్టర్లుగా మారడంతో నిఖిల్ కెరీర్ మళ్లీ మొదటికి వచ్చింది. ముద్ర చిత్రంపైనే చాలా ఆశలు పెట్టుకొన్నాడు.

     డైరెక్టర్‌తో ఇబ్బందులు

    డైరెక్టర్‌తో ఇబ్బందులు

    తనకు ఉన్న ప్రతికూలతను సానుకూలంగా మలుచుకోవడానికి నిఖిల్ ముద్ర అనే సినిమాను ఒప్పుకొన్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఘనిథన్ అనే సినిమాకు ఇది రీమేక్. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ తెలుగు రీమేక్‌కు పనిచేశాడు. ఈ షూటింగ్ సమయంలో నిర్మాత టాగోర్ మధును సదరు డైరెక్టర్ ముప్పు తిప్పలు పెట్టినట్టు ఫిలింనగర్‌లో ఓ టాక్.

    డిసెంబర్‌లో రీలీజ్‌పై అనుమానం

    డిసెంబర్‌లో రీలీజ్‌పై అనుమానం

    డైరెక్టర్ వ్యవహారంతో ముద్ర పలుమార్లు వాయిదా పడింది. తాజాగా అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని భావించారు. ఏదో కారణాల వల్ల దానిని డిసెంబర్ 7 తేదీకి మార్చారు. కానీ ఆ తర్వాత డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ చేద్దామని అనుకొన్నారు. అయినా డిసెంబర్‌లో రిలీజ్ అవుతుందనే గ్యారెంటీ కూడా లేదనే మాట మీడియాలో బలంగా వినిపిస్తున్నది.

    నకిలీ సర్టిఫికెట్ల ముఠా

    నకిలీ సర్టిఫికెట్ల ముఠా

    నకిలీ సర్టిఫికెట్ల ముఠా కథా నేపథ్యంతో ముద్ర చిత్రాన్ని టాగోర్ మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ కనిపించనున్నారు. తమిళంలో ఈ పాత్రను క్యాథరిన్ త్రెసా పోషించింది. నిఖిల్ ఈ చిత్రంలో జర్నలిస్టు పాత్రను పోషిస్తున్నారు.

    English summary
    Young Nikhil's Mudra is getting inexplicably delayed. Originally the film was to release in October. But, the date was later changed to December 7. Now it turns that the film would be released on in December-end. But we are still not sure.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X