పెళ్లి తర్వాత మరో పెద్ద రిస్క్ చేస్తున్న నిఖిల్.. కరోనా టైమ్‌లో భార్యతో
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ కరోనా పెరుగుతున్న సమయంలోనే ప్లాన్ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. అందరు బయటకు వెళ్లాడానికే బయపడుతుంటే ఈ యువ హీరో మాత్ర తనదైన శైలిలో పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు. మొత్తానికి మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం నిఖిల్ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు.

లాక్ డౌన్ కంటే ముందే..
లాక్ డౌన్ కంటే ముందే నిఖిల్ కార్తికేయ 2 పనులను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ అన్ని ప్లాన్ చేసుకున్న సమయంలో లాక్ డౌన్ దెబ్బ పడింది. దీంతో సినిమా పనులను మళ్ళీ కొత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇకపోతే కరోనా ఉన్నా కూడా సక్సెస్ ఫుల్ గా పెళ్లి చేసుకున్న నిఖిల్ ఇప్పుడు కార్తికేయ 2 కోసం ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సక్సెస్ ట్రాక్..
మొత్తానికి నిఖిల్ అర్జున్ సురవరం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. అంతకుముందు వరకు వరుస అపజయలతో సతమతమైన విషయం తెలిసిందే. అర్జున్ సురవరం కూడా కొన్ని నెలల పాటు రిలీజ్ కి నోచుకోలేక ఇబ్బంది పడింది. మొత్తానికి రిలీజ్ కావడంతో కుర్ర హీరో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు మరో హిట్టు కోసం కార్తికేయ సీక్వెల్ ని ప్లాన్ చేశాడు.

అక్కడే షూటింగ్..
ఇకపోతే కార్తికేయ 2 సినిమా బడ్జెట్ ని దృష్టిలో ఉంచుకొని సెట్స్ వేయడం కుదరదని కొన్ని సీన్లను రియల్ లొకేషన్స్ లోనే నిర్వహించాలని ఫారిన్ ట్రిప్ కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన సన్నివేశాల కోసం కంబోడియాలో ఒక భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. దర్శకుడు చందు మొండేటి ఇప్పటికే కొన్ని లొకేషన్స్ ని కూడా ఫిక్స్ చేసుకున్నాడట.
Recommended Video

బిగ్గెస్ట్ హిట్ కోసం...
ఇక త్వరలోనే చిత్ర యూనిట్ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని విదేశీ పర్యటనకు సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని నిఖిల్ ప్లాన్ చేసుకుంటున్నాడు. 2014లో వచ్చిన కార్తికేయ సినిమా 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా 20కోట్లకు పైగా వసూళ్లను అందుకొని నిఖిల్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు కార్తికేయ 2 ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











