కార్తికేయ సీక్వల్‌కి సర్వం సిద్ధం.. బయటకొచ్చిన కీలక సమాచారం

జయాపజయాలతో సంబంధం లేకుండా యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలు చేస్తున్నారు. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఒక స్టేజ్‌లో వరుసగా సూపర్ హిట్స్ కొట్టిన ఈ యువ హీరో ప్రస్తుతం డీలా పడ్డాడు. ఆయన గత సినిమా కిర్రాక్ పార్టీ ఆశించిన ఫలితం రాబట్టకపోవడం, తాజా సినిమా 'అర్జున్ సురవరం' విడుదలకు నోచుకోకపోవడం ఊహించని షాక్ ఇచ్చాయి.

సరిగ్గా ఈ తరుణంలో నిఖిల్ అభిమానులకు ఉరటనిచ్చేలా ఓ న్యూస్ బయటకొచ్చింది. గతంలో నిఖిల్ హీరోగా వచ్చిన 'కార్తికేయ' సినిమా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిఖిల్ స్టామినాను తెలియజేసింది. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నేపథ్యంలో సాగిన థ్రిల్లింగ్ కథాంశం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ చందూ.

Nikhil Siddharth Karthikeya sequel update

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా రూపొందించాలని ఫిక్స్ అయ్యారట. కార్తికేయ 2 అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట. ఇందుకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయని తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ అయిందని, అక్టోబర్ రెండో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'లో కనిపించిన శృతి శర్మను ఫైనల్ చేయబోతున్నారని తెలుస్తోంది. కార్తికేయ 2 రూపంలో నిఖిల్ కెరీర్‌లో మరో హిట్ ఖాయమే అని టాక్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X