twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజమే...హిందీవాళ్లు రైట్స్ కొనేస్తున్నారా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : సౌత్ లో రిలీజవుతున్న సినిమాలపై బాలీవుడ్ ఓ కన్నేస్తున్న సంగతి నిజమే. అయితే సినిమా సూపర్ హిట్టవమో, లేక కరెక్టుగా తమ బాలీవుడ్ కు కనెక్టు అవుతుందని భావించటమో జరగకపోతే వాళ్లు పట్టించుకోరు. ఆ మధ్యన నీలకంఠ మాయ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకున్న నేపధ్యంలో మరిన్ని చిన్న సినిమాలు కూడా అక్కడకు వెళ్తాయని భావిస్తున్నారు. రీసెంట్ గా...రిలిజైన కార్తికేయ చిత్రం సైతం బాలీవుడ్ కు వెల్తోందని టాక్ మొదలైంది. అయితే అది నిజమా..కావాలని సినిమాకు హైప్ క్రియేట్ చేయటానికి తెచ్చిన టాకా అన్నది తెలియాల్సి ఉంది.

    ఇదిలా ఉంటే... 'కార్తికేయ' టీమ్ అప్పుడే విజయోత్సవాలు మొదలెట్టింది.

    ''హ్యాపీడేస్‌', 'స్వామి రా రా' తరవాత నాకు లభించిన పెద్ద విజయమిది. నా కెరీర్‌కి బూస్ట్‌లా పనిచేస్తుంద''న్నారు నిఖిల్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'కార్తికేయ'. స్వాతి కథానాయిక. చందు మొండేటి దర్శకుడు. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విజయోత్సవం జరుపుకొంది.

    Nikil's Karthikeya goes to Bollywood

    నిఖిల్‌ మాట్లాడుతూ ''దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం బాగా నచ్చింది. సంగీతం, కెమెరా పనితనం ఉన్నత స్థాయిలో ఉన్నాయి. విజయంలో తొలి భాగం రావు రమేష్‌గారికే. ప్రచార చిత్రాల్లో ఆయన పలికిన సంభాషణలు హిప్నటైజ్‌ చేశాయి. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాయ''న్నారు.

    ''ఇది కార్తీకమాసం. అయితే 'కార్తికేయ' రాకతో కార్తికేయ మాసం అయిపోయింది'' అని తనికెళ్ల భరణి చమత్కరించారు. రావు రమేష్‌ చెబుతూ ''ఈ సినిమాను నిఖిల్‌ తన భుజాలపై వేసుకొని నడిపించాడు. వినోదం, టెన్షన్‌ కలగలిపిన ఈ చిత్రం మా అందరికీ మంచి పేరు తీసుకొచ్చింద''న్నారు. ''అందరి సహకారంతోనే ఇంత మంచి సినిమా తీయగలిగా'' అన్నారు దర్శకుడు.

    ''సినిమా విడుదలకు ముందు పడిన టెన్షన్‌ అంతా ఫలితం చూశాక మాయమైంద''ని నిర్మాత శ్రీనివాస్‌ బొగ్గారం చెప్పారు. సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర మాట్లాడుతూ ''కార్తికేయ నేపథ్య సంగీతం విషయంలో ప్రత్యేక దృష్టిపెట్టి పనిచేశా. సినిమా చూసినవాళ్లంతా నేపథ్య సంగీతం బాగుందని మెచ్చుకోవడం ఆనందాన్నిచ్చింద''న్నారు.

    English summary
    Leading Bollywood production houses have been competing to acquire the remake rights of Nikhil and Colors Swathi starrer 'Karthikeya' . The deal will be finalized within few days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X