అక్కడి వెలితే బికిని తోనే వెలుతారు చీర కట్టుకోరు...
బికినీతో నటిస్తే తప్పేంటని నికిషా పటేల్ ఎదురు ప్రశ్న వేస్తోంది. ఇటీవల విడుదలైన 'పులి'లో ఆమె నటించింది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆమె కొన్ని సంగతులు చెప్పుకొచ్చింది. బికినీ అంటే..అదేదో బూతులా చూస్తారెందుకు..అది వేసుకుంటే తప్పేంటి...? స్విమ్మింగ్ పూల్ కు వెళితే.. ఆ డ్రెస్ తోనే వెళతారు కానీ చీర కట్టుకోరుగా అంటూ ఎదురు ప్రశ్నలు వేసింది.
గతంలో బికినీలు వేసిన కొందరు తారలు చెప్పిన డైలాగులనే తిప్పి తిప్పి చెప్పడాన్ని చూసి విలేకరులు వారిలోవారే నవ్వుకున్నారు. అయినా అదేమీ పట్టని నికిష...'పులి" చిత్రం గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. ఫలానా చిత్రం సక్సెస్ అయిందా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడిందా అని తను చూడనంటోంది.
నటన వరకే తన బాధ్యత అని తర్వాత చిత్ర జయాపజయాల గురించి అస్సలు పట్టించుకోనని అంటోంది. ఎటువంటి పాత్రలు చేస్తారని అడిగితే.. దర్శకులు చెప్పింది చేయడమే కానీ...సొంతగా తాను చేయలేను అంటోంది. తాను ఇష్టపడేది బిర్యానీ అని చెప్పే ఈ ముద్దుగుమ్మ ఛాన్సు దొరికితే గుర్రు పెట్టి నిద్రపోతోందట.


Click it and Unblock the Notifications











