పవన్ కళ్యాణ్ తో చేయడం వల్ల అదృష్టం కలసిరావటం లేదు...
పవన్ కళ్యాణ్ తన ప్లాప్ సినిమాలతో కూడా కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టగలడు. 'పులి" లాంటి అద్వాన్నమైన చిత్రంతోనే ఇరవై కోట్లు వసూలు చేసిన ఘనత అతనిది. బయ్యర్ల కొంగు బంగారమైన పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ల విషయంలో మాత్రం అస్సలు కలిసి రాదు. తనతో నటించిన కొత్త హీరోయిన్లకయితే ఇండస్ట్రీలో సరయిన కెరీరే ఉండదు. గతంలో కూడా చాలా మంది మీరోయిన్లకి ఈ విషయం అనుభవంలోకి వచ్చింది.
తాజాగా 'పులి" నాయిక నిఖీషా పటేల్ కీ ఈ సంగతి రుజువయిది. 'పులి" తర్వాత ఆమెకు తెలుగులో ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఏలేదు. ఏదో కన్నడ సినిమాలో మాత్రమే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా ఒప్పుకోవాలో లేదో తెలీక ఆమె అయోమయంలో పడింది. తెలుగులోనే నటిస్తే మంచిదనేది ఆమె అభిప్రాయం. కానీ అవకాశాలు ఇచ్చేవాళ్లే కనిపించడం లేదు. ఇదంతా పవన్ కళ్యాణ్ హ్యాండ్ మహత్యం అని అంతా అంటుంటే నికీషా కూడా కాదనలేకపోతోంది.
పవన్ కళ్యాణ్ నిఖీషా పటేల్ పులి భూమిక మీరా చోప్రా pawan kalyan nikisha patel puli bhumika meera chopra


Click it and Unblock the Notifications