Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ హాట్ పాపే...తెలుగు సిల్క్‌స్మిత
విద్యాబాలన్ కథానాయికగా నటించిన 'డర్టీ పిక్చర్' చిత్రం ఓ రేంజ్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అద్భుతమైన ఆమె నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని పలు దక్షిణాది భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు వెర్షన్లో సిల్క్ పాత్రను హీరోయిన్ నిఖిత పోషించే అవకాశం వుందని సమాచారం. ఈ చిత్రం రీమేక్ కోసం సౌత్ నుంచి ప్రతిపాదనలు వచ్చిన మాట వాస్తవమేననీ, అందులో ఒక ప్రతిపాదన నిఖిత హీరోయిన్ గా వచ్చిందనీ 'డర్టీ పిక్చర్' నిర్మాణ సంస్థ బాలాజీ ఫిలిమ్స్ ప్రతినిధి స్వాతి శెట్టి చెప్పారు.
'హాయ్' చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిఖిత ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించినా సరైన గుర్తింపు రాలేదు. దీంతో మలయాళం, కన్నడ పరిశ్రమలపై దృష్టి సారించింది. కన్నడలో మంచి పొజీషన్లో ఉన్న ఆమెను అనుకోని వివాదం ఒకటి చుట్టు ముట్టింది. కన్నడ హీరో దర్శన్‌తో నిఖిత వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని వార్తలు రావడం, ఆమెపై మోజుతో తన భర్త నన్ను హింసిస్తున్నాడని దర్శన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం, అనంతరం దర్శనం అరెస్టు కావడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో చాలా అప్ సెట్ అయిన నిఖిత కొంత కాలం విదేశాల్లో గడిపింది. వివాదం సద్దుమనగడం, దర్శన్‌తో తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని తేలడంతో మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది నిఖిత. ఇలాంటి తరుణంలో నిఖిత సిల్క్ స్మిత పాత్రతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది.