ఒక్కోసారంతే ...దురదృష్టం మన కన్నా నాలుగు అడుగులు ముందు పరెగెడుతుందిట. తాజాగా నిఖిత ఆ పరిస్థితి ని ఎదర్కొంటోంది. హాయ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నిఖితకు మొదట్లో మంచి ఆఫర్లే వచ్చాయి. కాని రానరాను అవి సన్నగిల్లాయి. అప్పటికి వచ్చిన ప్రతీ అవకాశం ఒప్పుకుంటున్నా వర్కవుట్ కావటంలేదు.దాంతో పాపులారిటీ తో పాటే పారితోషికం కూడా రోజు రోజుకి తగ్గిపోసాగింది. ఇది చూసిన ఆమెలో తీరని బెంగ పెట్టుకుంది. ఆ మథ్య ఒకప్పటి హీరోయిన్ రాశి భర్త తీసిన మహారజశ్రీ సినిమా కొంత ఊరటనిస్తుందని ఆశించింది. ఎదురుచూసింది. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్లు ఫలితం మాత్రం మారలేదు. ఆలాగే హిట్టయిన అనసూయ లో పాత్ర వరస అవకాశాలు తెచ్చి పెడుతుంది అనుకుంది. ఈ సారి మొండి చెయ్యే. ఇవన్నీ కాదని కాళిదాసు లో కైపెక్కిచ్చేలా చిందులేస్తూ ఐటమ్ సాంగ్ చేసింది. ఇక్కడా అదృష్టం తిరగబడి థియోటర్లు సారి...ఇది ఖాళీదాసు అని వెక్కిరించాయి. ఇలా టాలీవుడ్ అడుగడుడికి ఫ్లాఫ్ నిస్తుంటే ఇక ఇక్కడ అనవసరమనుకుని పరభాషా చిత్రాలను పలకరించాలనుకుని డిసైడ్ అయిందిట. ప్రస్తుతం ఆ పనిలో ఉందిట.
Story first published: Sunday, May 17, 2026, 9:47 [IST]