చక్రం తిప్పిన సునీల్ నిర్మాతలు-‘నిప్పు’ వాయిదా?
రవితేజ 'నిప్పు' సక్రాంతి బరిలో నిలుస్తుందని అభిమానులు ఆశ పడ్డారు. అయితే పండగ పూట రవితేజ అభిమానులకు తమ అభిమాన హీరో సినిమా చూసే ఆనందం దక్క లేదు. ఆ తర్వాత జనవరి చివరి వారంలో అంటూ ప్రచారం జరిగినా....అనంతరం ఫిబ్రవరి 2న తప్పనిసరిగా విడుదల అవుతుందని వార్త అందడంతో సరేలే అని సరి పుచ్చుకున్నారు. తాజాగా నిర్మాత ఫిబ్రవరి 17 సినిమా విడుదల చేస్తామని అధికారిక ప్రకటన చేయడంతో ఇప్పటికే చాలా ఓపికగా ఎదురు చూస్తున్న అభిమానుల్లో కాస్త అసహనం, అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
సంక్రాంతి బరి నుంచి 'నిప్పు' తప్పుకోవడానికి....మహేష్ బాబు 'బిజినెస్ మేన్', వెంకటేష్ 'బాడీగార్డ్' సినిమాలతో పోటీ పడటం ఇష్టం లేకనే అని ప్రచారం జరిగింది. అయితే నిర్మాతలు మాత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కాక పోవడం వల్లనే విడుల చేయలేక పోయాం అని ప్రకటించారు.
అయితే తాజాగా ఫిబ్రవరి 2న నిప్పు విడుదల కాకుండా వాయిదా పడటానికి మాత్రం మరో కారణం వినిపస్తోంది. సునీల్ హీరోగా రూపొందుతున్న 'పూలరంగడు' సినిమా నిర్మాతలు చక్రం తిప్పడం వల్లనే నిప్పు సినిమా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. బిజినెస్ మేన్ సినిమా నిర్మించిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ వారే పూలరంగడు సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. బిజినెస్ మేన్ సినిమా సందర్భంగా అత్యధికంగా థియేటర్లను తమ గుప్పిట్లోకి తీసుకున్న ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వాటిని తమ ఆధీనంలోనే ఉంచుకుని ఫిబ్రవరి మొదటి వారంలో 'పూల రంగడు' చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
దీంతో అవసరం అయినన్ని థియేటర్లు దొరకని పరిస్థితి 'నిప్పు' నిర్మాతలకు ఏర్పడిందని, ఈ కారణంగానే గతిలేని పరిస్థితుల్లోనే ఫిబ్రవరి 17కు నిప్పు సినిమాను వాయిదా వేసుకున్నారని ట్రేడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











