Don't Miss!
- News మీ సేవలు చాలు ఇక- `అప్ప`ను పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ
- Sports IPL 2024: రాజస్థాన్ చేతిలో ఘోర పరాజయం.. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
విడుదలకు సిద్ధమైన నిశ్శబ్ధం... విడుదలపై కమ్ముకున్న నీలిమేఘాలు
టాలీవుడ్ జేజమ్మ నుంచి మరోసారి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీని ఆశిస్తున్న జనాలకు శుభవార్త లభించినట్లే. ఎందుకంటే, ఆమె కీలక పాత్ర పోషించిన నిశ్శబ్ధం చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. రచయిత కోన వెంకట్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించడంతో, చిత్ర యూనిట్ ఆనందోత్సాహాల్లో తేలిపోతోంది.
ఇక ఎప్పుడెప్పుడు నిశబ్ధం చిత్రాన్ని చూసేద్దామా అని జనాలు ఎదురుచూస్తుండగా, సినిమా రిలీజ్ పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో సినిమాను థియేటర్లలో విడుదల చేసే అవకాశం కనిపించడంలేదు. అయితే, చిత్ర యూనిట్ మాత్రం, సినిమాను తొలుత థియేటర్లలోనే విడుదల చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు హేమంత్ తమ సినిమాకు UA సర్టిఫికేట్ లభించిందని ట్వీట్ చేయగా, అందులోనే సెన్సార్ బోర్డ్ సభ్యులు తొలుత థియేటర్లలోనే విడుదల చేయమన్నారని సూచించారని వెల్లడించారు. హేమంత్ ట్వీట్ ను సమర్థిస్తూ, సినిమా నిర్మాత కోన వెంకట్ సైతం అదే అభిప్రాయాన్ని వెల్లడించారు.
నిశబ్ధం సినిమాను డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లలో విడుదల చేయడంపై మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ కోన వెంకట్ ట్వీట్ చేశారు. సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలన్నది తమ అభిమతమని వెల్లడించారు. అయితే, పరిస్థితులు ఇలానే కొనసాగితే అప్పుడు ఓటీటీ ఫాట్ ఫార్మ్ లపై విడుదల గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు.
సైలెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నిశ్శబ్ధంలో అనుష్క, మాధనవన్, శాలినీ పాండే, అంజలీతో పాటూ హాలీవుడ్ నటుడు మైఖెల్ మాడ్సన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మళయాళం, ఇంగ్లీషు భాషల్లో సినిమా రిలీజ్ అవ్వనుంది.