Don't Miss!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రియల్లీ షాకింగ్.. నితిన్, ఇలియానా రొమాన్స్
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ షాకింగ్ న్యూస్ వింటామో ఎవ్వరూ ఊహించలేరు. కొన్ని సందర్భాల్లో అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఇంకొన్ని సందర్భాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు హీరో నితిన్, గోవా బ్యూటీ ఇలియానా కలిసి మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది.
గత కొంత కాలంగా టాలీవుడ్ చిత్రసీమకు దూరంగా ఉన్న ఇలియానా.. ఇటీవలే రవితేజ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీలో హీరోయిన్గా అదరగొట్టేసింది. మళ్లీ తెలుగుతెరపై కనిపించని ఈ భామ త్వరలో నితిన్ హీరోగా విడుదలకానున్న కొత్త సినిమాలో కీలక పాత్ర పోషించనుందని సమాచారం. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సన్గత్య్ తెలిసిందే. ఈ చిత్రంలో సెన్సేషనల్ స్టార్ ప్రకాష్ వారియర్, అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా ఇప్పటికే సెలెక్ట్ అయ్యారు.
అయితే స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందట. ఈ క్యారెక్టర్ చిన్నదే అయినా సినిమాలో కీలకం కానుందని, ఈ క్యారెక్టర్‌కి ఇలియానా అయితే సూట్ అవుతుందని డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి భావిస్తున్నారట. ఈ మేరకు ఇలియానాతో సంప్రదింపులు ఓకే కూడా చేసేశారని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే నితిన్, ఇలియానా కలిసి నటించనున్న రెండో సినిమా ఇదే అవుతుంది. గతంలో నితిన్, ఇలియానా జంటగా రెచ్చిపో చిత్రంలో నటించారు.
ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా నితిన్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటికీ ఏకంగా నాలుగు సినిమాలను ఓకే చెప్పేశాడు నితిన్. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమా సెట్స్ పై ఉన్న నితిన్.. మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. వాటిలో ఒకటి వెంకీ అట్లూరి, ఇంకోటి కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందనుంది.