టెంపర్ రైటర్ తో నితిన్ న్యూ ప్రాజెక్ట్?
రంగ్ దే సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చిన యువ హీరో నితిన్ భవిష్యత్తు ప్రాజెక్టులను చాలా వేగంగా సెట్ చేసుకుంటున్నాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను వెంటవెంటనే లైన్ లో పెడుతున్నాడు. భీష్మ కంటే ముందు వరకు కొన్ని అపజయాలు రావడంతో కొంత గ్యాప్ తీసుకున్న నితిన్ ఇక నుంచి గ్యాప్ లేకుండా వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాడు.
ప్రస్తుతం రంగ్ దే సక్సెస్ అయిన తరుణంలో ఎంజాయ్ చేస్తున్న నితిన్ వెంటనే మాస్ట్రో కిక్కిచ్చాడు. పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ ను వదిలిన నితిన్ మంచి బజ్ అయితే క్రియేట్ చేశాడు. ఇక ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అందాదున్ సినిమాకు రీమేక్ గా రాబోతున్న ఆ సినిమా నితిన్ హోమ్ ప్రొడక్షన్ లో రూపొందుతోంది. మెర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు.

మాస్ట్రో అనంతరం నితిన్ మరో రెండు కథలను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. కిక్, టెంపర్ వంటి కథలని అందించిన వక్కంతం వంశీ రాసిన కథ కూడా అందులో ఉందట. వక్కంతం వంశీ అల్లు అర్జున్ తో నా పేరు శివ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత అనేక రకాల కథలతో హీరోల చుట్టూ తిరిగిన వంశీ ఎట్టకేలకు నితిన్ ను ఒప్పించినట్లు సమాచారం. మరి ఈ కాంబోపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











